News November 19, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News March 5, 2026
AC కొంటున్నారా? ఇవి గుర్తుంచుకోండి!

గతంలో ధనవంతులకే పరిమితమైన ACలు ఇప్పుడు దిగువ మధ్యతరగతి ఇళ్లకూ వచ్చేస్తున్నాయి. ACలు కొనేముందు కింది పాయింట్లను పరిశీలించండి.
*100-120 స్క్వేర్ ఫీట్ల గది ఉంటే 1 టన్ ఏసీ సరిపోతుంది.
*5 స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ స్ప్లిట్ ఏసీ కొనేందుకు ప్రయత్నించండి. దీనివల్ల 30-40% విద్యుత్ ఆదా అవుతుంది.
*కూలింగ్ కెపాసిటీ ఔట్‌పుట్ ఎక్కువగా ఉండాలి.
*10 ఏళ్ల కంప్రెషర్ వారంటీ ఉండేలా చూసుకోండి.
Share It
News March 5, 2026
న్యూక్లియర్ ప్రోగ్రామ్‌ను ఆపేందుకు రెడీ.. కాకపోతే: ఇరాన్

US, ఇజ్రాయెల్‌తో యుద్ధం తీవ్రంగా జరుగుతున్న సమయంలో ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి మజీద్ తఖ్త్ రావంచి కీలక ప్రకటన చేశారు. అణ్వాయుధ ప్రోగ్రామ్‌ను ఆపేందుకు తాము సిద్ధమని ప్రకటించారు. కానీ తమకు సంతృప్తికర ప్రత్యామ్నాయ ఆఫర్ ఇవ్వాలని కండీషన్ పెట్టారు. అయితే ఇది తాజా ఆఫర్ కాదని, అమెరికాతో జరిపిన గత చర్చలకు సంబంధించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారని ప్రభుత్వ న్యూస్ ఏజెన్సీ IRNA చెప్పుకొచ్చింది.
News March 5, 2026
సంతానోత్పత్తికోసం ‘మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’: CBN

AP: సంతాన లేమితో బాధపడుతున్న వారిని ప్రభుత్వం ఆదుకుంటుందని CM చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించారు. PPP మోడల్‌లో ‘మాతృత్వ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్’లు ఏర్పాటు చేసి సబ్సిడీపై IVF సేవలు అందించాలని యోచిస్తున్నామన్నారు. ‘ఒకప్పుడు 3.0గా ఉన్న ఫెర్టిలిటీ రేట్ 1.5కి తగ్గిపోయింది. దీనివల్ల పనిచేసే వారి సంఖ్య తగ్గి ఆర్థిక వృద్ధి పడిపోతుంది. టీనేజ్ గర్భధారణలు తగ్గించే చర్యలు చేపడుతున్నాం’ అని CBN పేర్కొన్నారు.


