News November 19, 2025
నిర్మల్: ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు

నిర్మల్ జిల్లాలోని 9, 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన, ఎయిడెడ్ పాఠశాలల బీసీ, ఈబీసీ విద్యార్థులు ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ కోసం డిసెంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి డి.శ్రీనివాస్ తెలిపారు. http://telangana epass.cgg. gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News March 18, 2026
సిద్దిపేట: ఘోర ప్రమాదం.. ఇద్దరు బాలురు మృతి

మిరుదొడ్డిలో <<19418573>>రోడ్డు <<>>ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన ముగ్గురు బాలురిలో చెన్నయ్ నితిన్‌ను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందాడు. మరో బాలుడు పిట్ల రామ్ చరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచాడు. మరో బాలుడు సాన హర్షవర్ధన్ స్వల్ప గాయాలతో ప్రాణాపాయం నుంచి బయటపడి చికిత్స పొందుతున్నాడు.
News March 18, 2026
పుదుచ్చేరిలో ఎన్నికలు.. ‘జిల్లాలో మూడు చోట్ల చెక్ పోస్టులు’

పుదుచ్చేరి, యానాం ఎన్నికల నేపథ్యంలో జిల్లాలో పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ షామ్మోహన్ తెలిపారు. ఈనెల 18 నుంచి ఏప్రిల్ 9 వరకు నీలపల్లి, మల్లవరం, సుంకరపాలెం వద్ద 3 చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. 24 గంటల పాటు రొటేషన్ పద్ధతిలో రెవెన్యూ, ఎక్సైజ్, కమర్షియల్ టాక్స్ అధికారులు ఇక్కడ విధులు నిర్వహిస్తారు. అక్రమ మద్యం, నగదు, ఓటర్లకు పంచే సామాగ్రి తరలిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు.
News March 18, 2026
కీసరగుట్ట రామలింగేశ్వర స్వామికి అన్నాభిషేకం

కీసరగుట్టలోని శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేశ్ శర్మ ప్రత్యేకంగా అన్నాభిషేకం చేశారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు వేదమంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి అన్నాభిషేకం చేసి స్వామికి అభిషేకించిన అన్నాన్ని భక్తులకు ప్రసాదంగా అందించారు.


