News November 19, 2025

ఈనెల 23న రాప్తాడుకు వైఎస్ జగన్

image

ఈనెల 23న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మాజీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాంతో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు గురించి చర్చించారు.

Similar News

News March 23, 2026

నేడు అకౌంట్లలోకి రూ.6,000

image

TG: సిద్దిపేట పర్యటనలో నిన్న సీఎం రేవంత్ <<19449281>>విడుదల<<>> చేసిన తొలి విడత రైతు భరోసా నిధులు ఇవాళ అకౌంట్లలో జమ కానున్నాయి. రూ.6వేల చొప్పున రూ.3,600 కోట్లు అన్నదాతల ఖాతాల్లో చేరనున్నాయి. మరో 20 రోజుల్లో రూ.2,700 కోట్లు, ఆ తర్వాత 20 రోజులకు రూ.2,700 కోట్లు రిలీజ్ చేస్తామని రేవంత్ వెల్లడించారు. మొత్తంగా దాదాపు 70 లక్షల మందికి ప్రయోజనం కలిగిస్తామన్నారు.

News March 23, 2026

అనకాపల్లి: ఇవాళ ఈ నంబరుకు కాల్ చేయండి

image

విద్యుత్ సమస్యలపై డయల్ యువర్ ఏపీఈపీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహిస్తున్నట్లు సీఎండీ పృథ్వీతేజ్ తెలిపారు. అనకాపల్లి, విశాఖ, అల్లూరి తదితర జిల్లాలకు చెందిన వినియోగదారులు 8688400499 నెంబర్ కు కాల్ చేసి సమస్యలు తెలియచేయవచ్చునని అన్నారు. ఉదయం 10:30 గంటల నుంచి 11:30 గంటల వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News March 23, 2026

భూపాలపల్లి: వెలుగులోకి డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ల బాగోతం!

image

యుద్ధం నేపథ్యంలో నెలకొన్న గ్యాస్ కొరత వల్ల డొమెస్టిక్ గ్యాస్ కనెక్షన్ల బాగోతం వెలుగులోకి వస్తోంది. 12 మండలాల్లో కేవలం 381 కమర్షియల్ కనెక్షన్లు ఉన్నాయంటే పరిస్థితి అద్దం పడుతోంది. వందల సంఖ్యలో హోటళ్లు, మొబైల్ వ్యాన్లు, టీ సెంటర్లు, బజ్జీల బండ్ల వద్ద కమర్షియల్ గ్యాస్ సిలిండర్లు కాకుండా డొమెస్టిక్ సిలిండర్లనే ఎక్కువగా వాడుతున్నారని తెలుస్తోంది. జిల్లాలో 1,20,457 గృహ గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.