News November 19, 2025
ఈనెల 23న రాప్తాడుకు వైఎస్ జగన్

ఈనెల 23న వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాప్తాడుకు రానున్నారు. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడి కుమార్తె వివాహానికి హాజరు కానున్నారు. ఈ సందర్భంగా హెలిప్యాడ్ స్థలాన్ని అనంతపురం రూరల్ డీఎస్పీ వెంకటేశ్వర్లు మాజీ సీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలసిల రఘురాంతో కలిసి పరిశీలించారు. అక్కడ చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లు గురించి చర్చించారు.
Similar News
News March 24, 2026
ఉమ్మడి కడప జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు

నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. APలో అసెంబ్లీ స్థానాలు 175 నుంచి 263కు పెరిగే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం ఉమ్మడి కడప జిల్లాలో <<19460921>>10 అసెంబ్లీ<<>> స్థానాలు ఉండగా ఆ సంఖ్య 15 వరకు చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం కడప, రాజంపేట పార్లమెంట్ స్థానాలు ఉండగా, కొత్తగా మరో MP స్థానం పెరిగే అవకాశం ఉంది. జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.
News March 24, 2026
ఉమ్మడి ప.గో. జిల్లాలో పెరగనున్న MLA, MP సీట్లు..!

ఏపీలో MLA, MP స్థానాలు పెంపుపై కేంద్రం చర్చలు జరుపుతోంది. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే బిల్లు పెడతారని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఉమ్మడి ప.గో. జిల్లాలోనూ సీట్ల సంఖ్య <<19460921>>50 శాతం పెరగనున్నట్లు<<>> తెలుస్తోంది. ప్రస్తుతం 15 MLA సీట్లు, 2 ఎంపీ సీట్లు ఉండగా.. అవి కాస్త 22 MLA సీట్లు, 3 ఎంపీ స్థానాలు అయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ ప్రాథమిక అంచనాలే కాగా, జనగణన తర్వాతే తుది సంఖ్య ఖరారు కానుంది.
News March 24, 2026
NZB: ఉమ్మడి జిల్లాలో పెరగనున్న అసెంబ్లీ స్థానాలు?

2011 జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. అసెంబ్లీ స్థానాలను 50 శాతం పెంచే ప్రతిపాదనతో TGలో MLA సీట్లు 179కి చేరే అవకాశం ఉంది. ఈ లెక్కన ఉమ్మడి NZB జిల్లాలో ప్రస్తుతం ఉన్న 9 నియోజకవర్గాల సంఖ్య 13కు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా నిజామాబాద్ అర్బన్, కామారెడ్డి, బాన్సువాడ వంటి పెద్ద సెగ్మంట్లు విభజనకు గురయ్యే ఛాన్స్ ఉంది. ఎంపీ స్థానంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు.


