News November 19, 2025
ఏపీలో MSME ఎకోసిస్టమ్ బలోపేతానికి సహాయం పెంచండి: మంత్రి

ఏపీలోని MSME రంగం అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై కేంద్రంతో చర్చలు జరిగాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఢిల్లీలో కేంద్ర MSME మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి & అభివృద్ధి కమిషనర్ డాక్టర్ రజనీష్‌ను మంగళవారం కలిశారు. రాష్ట్రంలో అమలవుతున్న MSME ప్రాజెక్టులు, వాటి పురోగతి, అవసరమైన సహాయంపై వివరించానని, ఎకోసిస్టమ్‌ను బలోపేతం చేయడానికి కేంద్రం నుంచి అందే సహాయాన్ని పెంచాలని కోరినట్లు తెలిపారు.
Similar News
News November 21, 2025
బరితెగించారు.. మోదీ-మైథిలీపై AI అసభ్యకర వీడియో

AI టెక్నాలజీతో క్రియేటర్లు రెచ్చిపోతున్నారు. తాజాగా పీఎం మోదీ, బిహార్ ఎన్నికల్లో విజయం సాధించిన సింగర్ మైథిలి ఠాకూర్‌పై అసభ్యకర AI వీడియోను రూపొందించి SMలో పెట్టారు. దీన్ని బీజేపీ నేతలు, శ్రేణులు తీవ్రంగా ఖండిస్తున్నాయి. వెంటనే ఆ వీడియోను తొలగించాలని, క్రియేట్ చేసిన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
NOTE: సెన్సిటివిటీ దృష్ట్యా వీడియోను పోస్ట్ చేయలేకపోతున్నాం.
News November 21, 2025
BREAKING: ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆదిలాబాద్ ఏఎస్పీగా మౌనిక, ఉట్నూర్ ఏఎస్పీగా కాజల్ సింగ్ నియమితులయ్యారు. కాజల్ సింగ్ ఇదివరకు ఉట్నూర్ ఎస్డీపీవోగా, మౌనిక ఇదివరకు దేవరకొండ ఏఎస్పీగా బాధ్యతలు నిర్వహించారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.
News November 21, 2025
నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్

రాష్ట్రంలో 32 మంది IPSలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నిర్మల్ ఏఎస్పీగా సాయికిరణ్, భైంసా ఎస్డీపీవోగా రాజేశ్ మీనా నియమితులయ్యారు. రాజేశ్ మీనా గతంలో నిర్మల్ ఏఎస్పీగా పని చేశారు. ఈ మేరకు వీరు త్వరలోనే బాధ్యతలు చేపట్టనున్నారు.


