News November 19, 2025

భారత్, బంగ్లాదేశ్ సిరీస్ వాయిదా

image

భారత్, బంగ్లాదేశ్ మహిళల జట్ల మధ్య డిసెంబర్‌లో జరగాల్సిన సిరీస్‌ను బీసీసీఐ వాయిదా వేసింది. రెండు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. బంగ్లాతో సిరీస్‌కు తమకు పర్మిషన్ రాలేదని బీసీసీఐ వర్గాలు తెలిపాయి. డిసెంబర్‌లో ప్రత్యామ్నాయ సిరీస్‌కు ఏర్పాట్లు చేస్తామని వెల్లడించాయి. కాగా షెడ్యూల్‌లో భాగంగా మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది.

Similar News

News March 5, 2026

విరోష్ జంటకు సీఎం శుభాకాంక్షలు

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నూతన దంపతులు రష్మిక-విజయ్ దేవరకొండను ఆశీర్వదించారు. రిసెప్షన్ సమయంలో ఢిల్లీలో ఉన్న సీఎం.. ఇవాళ విజయ్ నివాసానికి వెళ్లారు. కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారి ఫ్యామిలీతో కలిసి ఫొటో దిగారు.

News March 5, 2026

సెమీస్.. భారత్ భారీ స్కోర్

image

T20WC సెమీస్‌లో ఇంగ్లండ్‌పై టీమ్ ఇండియా 253/7 స్కోర్ చేసింది. అభిషేక్(9), సూర్య(11) విఫలమవగా, సంజూ శాంసన్ 89, ఇషాన్ 39, శివమ్ దూబే 43, తిలక్ 21, హార్దిక్ 27 రన్స్‌తో రాణించారు. విల్ జాక్స్, రషీద్ చెరో 2, ఆర్చర్ ఒక వికెట్ తీశారు. విజయం కోసం ఇంగ్లండ్ 254 పరుగులు చేయాలి. ఇవాళ గెలిచిన జట్టు ఈ నెల 8న ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో పోటీ పడుతుంది.

News March 5, 2026

బాలీవుడ్ మూవీలా పశ్చిమాసియా పాలిటిక్స్!

image

పశ్చిమాసియా జియో పాలిటిక్స్ బాలీవుడ్ మూవీలా కనిపిస్తున్నాయంటూ <<18418395>>హర్ష్ గోయెంకా<<>> ట్వీట్ చేశారు. ‘‘ఇజ్రాయెల్‌ వెంట IND ఉంది. USతో ఇజ్రాయెల్, పాక్‌తో US, ఇరాన్‌ వెంట PAK ఉంది. అయితే IND-PAK శత్రువులుగానే ఉన్నాయి. ఇది ‘ముఖద్దర్ కా సికందర్‌’ మూవీని గుర్తు చేస్తోంది. రేఖను అంజాద్ ప్రేమిస్తారు. అమితాబ్‌ను రేఖ, రాఖీని అమితాబ్, వినోద్‌ను రాఖీ లవ్ చేస్తారు. అయితే అంజాద్, అమితాబ్ శత్రువులే’’ అని పేర్కొన్నారు.