News November 19, 2025

టీమ్ ఇండియా ప్రాక్టీస్‌లో మిస్టరీ స్పిన్నర్‌

image

సౌతాఫ్రికాతో తొలి టెస్టులో స్పిన్నర్ల ధాటికి టీమ్ ఇండియా ఘోరంగా <<18303459>>ఓడిన <<>>సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రొటీస్ బౌలర్లను ఎదుర్కొనేందుకు మిస్టరీ స్పిన్నర్‌ను మేనేజ్‌మెంట్ రంగంలోకి దించింది. ప్రాక్టీస్ సెషన్‌లో స్పిన్నర్ కౌశిక్ మైతీ(WB)తో బౌలింగ్ చేయించింది. 2 చేతులతో బౌలింగ్ చేయగలగడం కౌశిక్ ప్రత్యేకత. లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లకు కుడి చేతితో, రైట్ హ్యాండ్ బ్యాటర్లకు ఎడమ చేతితో బౌలింగ్ వేయగలరు.

Similar News

News March 23, 2026

సంచలన ప్రకటన.. యుద్ధానికి బ్రేక్

image

ఇరాన్‌తో జరుగుతున్న యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. 5 రోజుల పాటు దాడులు ఆపనున్నట్లు వెల్లడించారు. ఇరాన్ పవర్ ప్లాంట్లు, ఎనర్జీ ఇన్‌ఫ్రాపై మిలిటరీ స్ట్రైక్స్‌ను వాయిదా వేస్తున్నామని ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు. ఈ మేరకు ఇరు దేశాల మధ్య 2 రోజులపాటు జరిగిన చర్చలు సఫలమయ్యాయని వివరించారు. చర్చలు ఈ వారం మొత్తం కొనసాగుతాయని తెలిపారు.

News March 23, 2026

గల్ఫ్‌ రూట్లను మైన్స్‌తో నింపేస్తాం: ఇరాన్ హెచ్చరిక

image

తమ దేశ తీరం, ద్వీపాలపై దాడికి యత్నిస్తే గల్ఫ్‌ రూట్లను సీమైన్స్‌తో నింపేస్తామని ఇరాన్ డిఫెన్స్ కౌన్సిల్ హెచ్చరించింది. ఫ్లోటింగ్ మైన్స్‌ను తీరం నుంచే రిలీజ్ చేస్తామని స్పష్టంచేసింది. అదే జరిగితే హార్ముజ్ జలసంధిలో నెలకొన్న పరిస్థితే గల్ఫ్ అంతటా సుదీర్ఘకాలం ఉంటుందని చెప్పింది. 1980ల్లో పెట్టిన సీమైన్స్‌ను తొలగించేందుకు మైన్ స్వీపర్లు ప్రయత్నించి ఫెయిలైన విషయం మర్చిపోవద్దని వార్నింగ్ ఇచ్చింది.

News March 23, 2026

పీరియడ్స్‌లో దైవ దర్శనం చేసుకోవచ్చా?

image

తీర్థయాత్ర సమయంలో పీరియడ్స్ వస్తే దైవ దర్శనం చేసుకోవచ్చా? అన్న సందేహంపై ఆధ్యాత్మిక గురువు ప్రేమానంద్ మహారాజ్ స్పష్టతనిచ్చారు. ‘నెలసరి అనేది ప్రకృతి సిద్ధమైన ప్రక్రియే కానీ పాపం కాదు. యాత్రలో పీరియడ్స్ వస్తే, స్నానం చేసి శుచిగా ఉండి దూరం నుంచే దేవుడిని దర్శించుకోవచ్చు. పూజా సామగ్రిని తాకడం, ప్రసాదం వండటం వంటివి చేయకూడదు. భగవంతుడికి కావాల్సింది కేవలం నిర్మలమైన భక్తి మాత్రమే’ అని వివరించారు.