News November 19, 2025
HYD: ఈనెల 19న పీజీ, పీహెచ్‌డీ ప్రవేశాలకు కౌన్సిలింగ్

ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన PG & PhD ప్రవేశాలకు 2వ విడత కౌన్సిలింగ్ ఈనెల 19న జరగనుంది. యూనివర్సిటీ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గంటలకు నిర్వహించనున్నారు. ఆసక్తి, అర్హులైన అభ్యర్థులు హాజరు కావాలని, ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.
Similar News
News March 21, 2026
Wah.. నగరమంతా నోరూరించే సువాసన

రంజాన్ అనగానే షీర్ ఖుర్మా గుర్తొస్తుంది. నగరమంతా దీని గుమగుమలతో నిండిపోతుంది. గల్లీల్లో దోస్తులందరినీ ఇంటికి పిలిచి దావత్ ఇచ్చి ఆఖరున షీర్ ఖుర్మాతో నోరు తీపి చేస్తారు. ఈ షీర్ ఖుర్మాకు ప్రత్యేకత ఉంది. పాలను బాగా మరిగించి ఖర్జూరాల తీపితో చేసే ఈ డెజర్ట్ తక్షణ శక్తినిస్తుంది. దీంట్లోని కాల్షయం, ప్రోటీన్లు ఎముకలను బలపరిచి, జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయని నిపుణుల మాట.
News March 21, 2026
HYDలో దారుణం.. లవర్‌పై కత్తితో దాడి

మియాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. పోలీసుల వివరాలిలా.. తనను కాదని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుందన్న కోపంతో అలీషా అలియాస్ పాండు తన తండ్రి లాలూతో కలిసి యువతిపై కత్తితో దాడి చేశాడు. తీవ్ర గాయాలపాలైన బాధితురాలు నూకరత్నం (25)ను స్థానికులు వెంటనే గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు నిందితులను అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 21, 2026
HYD: MMTS 2వ దశకు రూ.50కోట్లు

MMTS 2వ దశ కోసం ప్రభుత్వం రూ.50 కోట్లు కేటాయించింది. రెండో దశలో నగర శివారు ప్రాంతాలను కలుపుతూ ఆరు మార్గాల్లో ఎంఎంటీఎస్ విస్తరణ చేపట్టారు. అప్పట్లో రూ.850 కోట్లతో ప్రణాళికలను రూపొందించారు. ప్రాజెక్టు జాప్యంతో ఇది రూ.1.150 కోట్లు దాటింది. రాష్ట్ర ప్రభుత్వం 1/3, రైల్వేశాఖ 1/4 చొప్పున నిధులు అందజేయాలి. ఈ మేరకు ఏటా బడ్జెట్‌లో MMTS కోసం కేటాయిస్తున్నారు.


