News November 19, 2025
మానవ రూపంలో గణేషుడ్ని చూశారా?

మనందరికీ ఏనుగు తలతో కూడిన గణపతి మాత్రమే తెలుసు. కానీ ఆయన మానవ రూపంలో ఎలా ఉంటారో చాలామందికి తెలీదు. అయితే వినాయకుడు నరుడిగా దర్శనమిచ్చే ఆలయం తమిళనాడులోని తిరువారూర్ జిల్లాలో ఉంది. ఇక్కడ ఆది వినాయకుడిగా పూజలందుకునే స్వామివారికి త్రేతా యుగంలో రాములవారు పూజలు నిర్వహించినట్లు స్థల పురాణం చెబుతోంది. అప్పుడు రాముడు సమర్పించిన పిండాలు 4 శివలింగాలుగా మారాయట. వాటినీ ఈ ఆలయంలో చూడవచ్చు. <<-se>>#Temple<<>>
Similar News
News March 20, 2026
ఒక్క రోజే రూ.5,000 తగ్గిన వెండి ధర

హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఓ వైపు <<19430821>>బంగారం<<>> ధరలు పెరగ్గా వెండి ధరలు తగ్గాయి. కేజీ సిల్వర్‌పై రూ.5వేలు తగ్గి రూ.2,60,000 పలుకుతోంది. నిన్న కూడా కేజీపై రూ.10,000 తగ్గిన విషయం తెలిసిందే. మొత్తంగా 3 రోజుల్లో కేజీపై రూ.20,000 తగ్గడం గమనార్హం.
News March 20, 2026
టిమ్స్‌ల ప్రారంభంపై భట్టి ప్రకటన

TG: 2026 చివరి నాటికి సనత్‌నగర్, LBనగర్, అల్వాల్ టిమ్స్‌లను ప్రారంభిస్తామని బడ్జెట్ ప్రసంగంలో భట్టి విక్రమార్క తెలిపారు. వీటితో పాటు నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో మొత్తం 6,582 టెర్షియరీ కేర్ బెడ్లు అందుబాటులోకి తెస్తామన్నారు. ఇప్పటికే 9 ప్రభుత్వ మెడికల్, 16 నర్సింగ్, 28 పారా మెడికల్ కాలేజీలు ప్రారంభించినట్లు వివరించారు. కొత్తగా మరో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తామన్నారు.
News March 20, 2026
గుడ్ న్యూస్: ధాన్యం సేకరణకు రూ.22,700 కోట్లు

TG: పంట ఉత్పత్తుల కొనుగోళ్లకు GOVT రూ.22,700CRను రెడీ చేసింది. యాసంగిలో రైతుల నుంచి ధాన్యం సేకరణకు అవసరమైన నిధులను పౌరసరఫరాల సంస్థ ఖాతాలో రుణం రూపేణా జమ చేయించింది. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి ఈ రుణాన్ని ఇప్పించింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఈ రుణానికి గ్యారంటీ ఇస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో యాసంగిలో రైతుల నుంచి మార్క్‌ఫెడ్ ద్వారా 95L MT ధాన్యాన్ని సేకరించనున్నారు.


