News April 13, 2024

శ్రీకాకుళం :ఈనెల 15వ తేదీ నుంచి చేపల వేటపై నిషేధం

image

శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 15వ తేదీ నుంచి జూన్ 14వ తేదీ వరకు చేపల వేట నిషేధిస్తున్నట్లు ఫిషరీస్ డిపార్ట్మెంట్ డీడీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. సుమారు 61 రోజులు పాటు సముద్ర జలాలలో చేపల వేట నిషేధం అమలులో ఉంటుందన్నారు. ఈ రెండు నెలల సమయం చేపలు సంతానోత్పత్తిని పెంచేందుకు ఉపయోగపడుతుందన్నారు.

Similar News

News March 12, 2026

SKLM: రాష్ట్ర స్థాయి కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న కలెక్టర్

image

శ్రీకాకుళం కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం అమరావతిలో జరుగుతున్న రాష్ట్రస్థాయి 6వ జిల్లా కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్నారు. జిల్లాలో అమలవుతున్న ప్రభుత్వ పథకాలు నివేదికను ఉన్నతాధికారులకు తెలియజేశారు. ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ‌తో పాటు రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల కలెక్టర్లు ఈ సదస్సులో పాల్గొన్నారు.

News March 11, 2026

కోటబొమ్మాళి: భర్తపై భార్య దాడి

image

భర్తపై భార్య దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన కోటబొమ్మాళి మండలం మంచాలపేటలో జరిగింది. భర్తను సోదరిడితో కలిసి ఓ గదిలో బంధించి కొట్టగా తీవ్ర గాయాలపాలయ్యాడు. అనంతరం గమనించిన కుటుంబీకులు తక్షణం సమీప ఆసుపత్రిలో చేర్చారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు అందినట్లు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News March 11, 2026

శ్రీకాకుళం పదో తరగతి విద్యార్థులకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం

image

పదో తరగతి పబ్లిక్ పరీక్షల సందర్భంగా విద్యార్థులకు ఏపీఎస్‌ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తోంది. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు బస్సుల్లో హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రానికి వెళ్లేందుకు విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చని జిల్లా ప్రజా రవాణా అధికారి సీహెచ్ అప్పల నారాయణ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సౌకర్యాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.