News November 19, 2025
2027 ఆగస్టులో బుల్లెట్ రైలు పరుగులు

దేశంలో 2027 ఆగస్టులో తొలి బుల్లెట్ రైలు ప్రారంభమవుతుందని రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. తొలి దశలో గుజరాత్‌లోని సూరత్, వాపి మధ్య 100 కి.మీ. మేర నడపనున్నట్లు చెప్పారు. మొత్తం ప్రాజెక్టు 2029లో పూర్తవుతుందని అన్నారు. ముంబై-అహ్మదాబాద్ కారిడార్ అందుబాటులోకి వస్తే 2 గంటల్లోనే జర్నీ పూర్తి అవుతుందని అన్నారు. ఇటీవల ప్రధాని <<18307759>>పర్యటన <<>>తర్వాత అశ్వినీ వైష్ణవ్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
Similar News
News March 21, 2026
అంగారకుడిపై ఒకప్పుడు పుష్కలంగా నీళ్లు!

మానవులు జీవించడానికి అనుకూలమైన గ్రహాన్ని అన్వేషించడంలో కీలక పురోగతి లభించింది. అంగారకుడిపై ఒకప్పుడు నీరు పుష్కలంగా ప్రవహించిందనడానికి నాసా సైంటిస్టులు కొత్త ఆధారాలు కనుగొన్నారు. నాసా 2020లో ప్రయోగించిన Perseverance రోవర్ మార్స్‌లోని జెజెరో క్రేటర్‌లో 6.1KM ప్రయాణించి 35M లోతున భౌగోళిక నిర్మాణాలను విశ్లేషించింది. అక్కడ 3.7-4.2 బిలియన్ ఏళ్ల కిందట ఓ సరస్సు ఉండేదని నిర్ధారించింది.
News March 21, 2026
‘ధురంధర్’.. హీరో రెమ్యునరేషన్ ఎంతంటే?

ధురంధర్ సినిమా రెండు పార్టులకు కలిపి దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్ అయినట్లు జాతీయ మీడియా పేర్కొంది. హీరో రణ్‌వీర్ సింగ్ రూ.50 కోట్లు, సంజయ్ దత్ రూ.10 కోట్లు, మాధవన్ రూ.9 కోట్లు, అక్షయ్ ఖన్నా రూ.2.5 కోట్లు, అర్జున్ రాంపాల్ రూ.కోటి, సారా అర్జున్ రూ.కోటి తీసుకున్నట్లు సమాచారం. కాగా పార్ట్-1 రూ.1,300 కోట్ల కలెక్షన్లు సాధించింది. పార్ట్-2 అంతకంటే ఎక్కువే రాబట్టడం పక్కా అని నెటిజన్లు అంటున్నారు.
News March 21, 2026
కుప్పకూలిన ధరలు.. టమాటా రైతుల కన్నీళ్లు

AP: గిట్టుబాటు ధర లభించక టమాటా రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. అనంతపురం(D) కక్కలపల్లి మార్కెట్‌లో నిన్న KG ధర గరిష్ఠంగా ₹7, కనిష్ఠంగా ₹3, సగటున ₹5 మాత్రమే పలికింది. అన్నమయ్య జిల్లాలో కోత ఖర్చులూ రాకపోవడంతో అన్నదాతలు పంటను పశువులకు వదిలేశారు. శ్రీకాకుళం(D)లోని పలు గ్రామాల్లో 27 KGల ట్రే ధర ₹70-90కి పడిపోయింది. వ్యాపారులు మాత్రం KG ₹20-30కి విక్రయిస్తుండటం గమనార్హం. మీ ఏరియాలో టమాటా రేటు ఎలా ఉంది?


