News April 13, 2024
24 వరకు సప్లిమెంటరీ దరఖాస్తులు: ప్రభాకర్

ఇంటర్లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని ఏలూరు జిల్లా వృత్తి విద్యాధికారి బి.ప్రభాకర్ తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు ఉందన్నారు. అలాగే రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఈనెల 18 నుంచి 24 వరకూ సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్ 1 వరకు జరుగుతాయన్నారు. SHARE IT..
Similar News
News October 6, 2025
ఎస్పీ కార్యాలయంలో పిజిఆర్ఎస్కు 16 అర్జీలు

పాలకోడేరు (M) గొల్లలకోడేరులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి, సంబంధిత పోలీస్ స్టేషన్లకు పంపి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు. ఈ కార్యక్రమంలో మొత్తం 16 ఫిర్యాదులు వచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
News October 6, 2025
పండుగప్ప ధరలకు రెక్కలు..!

పశ్చిమ గోదావరి జిల్లాలో పండుగప్ప చేపల ధరలు అమాంతం పెరిగాయి. నాలుగు నెలల క్రితం రూ. 370 ఉన్న కిలో ధర ప్రస్తుతం రూ. 500కు చేరడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అధిక ఆదాయం వస్తుండటంతో చెరువుల రైతులు పండుగప్ప జాతి చేపల పెంపకంపై ఆసక్తి చూపుతున్నారు. ఈ చేపలు జిల్లా నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు భారీగా ఎగుమతి అవుతున్నాయి.
News October 6, 2025
ద్వారకాతిరుమల: నేడు శ్రీవారి కళ్యాణ మహోత్సవం

ద్వారకాతిరుమల శ్రీవారి దివ్య కళ్యాణ మహోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం రాత్రి చిన్న వెంకన్న కళ్యాణం అంగరంగ వైభవంగా జరిపించేందుకు అనివేటి మండపంలో కళ్యాణ మండపాన్ని ముస్తాబు చేశారు. మండప పరిసరాలను సుందరంగా తీర్చిదిద్దారు. పూల అలంకరణ సోమవారం సాయంత్రానికి పూర్తవుతుందని ఆలయ ఈవో ఎన్.వి. సత్యనారాయణమూర్తి తెలిపారు. శ్రీహరి కళాతోరణం వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నాయి.