News April 13, 2024

24 వరకు సప్లిమెంటరీ దరఖాస్తులు: NSVL నరసింహం

image

ఇంటర్‌లో ఫెయిలైన విద్యార్థులు ఈనెల 18 నుంచి సప్లిమెంటరీ పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని అధికారి NSVL నరసింహం తెలిపారు. సప్లిమెంటరీ పరీక్షల దరఖాస్తుకు ఈనెల 24 వరకు గడువు ఉందన్నారు. రీ కౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం కూడా ఈనెల 18 నుంచి 24 వరకూ సంబంధిత కళాశాలల్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. థియరీ పరీక్షలు మే 24 నుంచి జూన్‌ 1 వరకు జరుగుతాయన్నారు. SHARE IT..

Similar News

News October 6, 2025

నవోదయం 2.0 సారా రహిత జిల్లాగా తీర్చిదిద్దుదాం: కలెక్టర్

image

జిల్లా పరిసర ప్రాంతాల్లో ఎవరైనా నాటుసారా తయారు చేసినా, రవాణా చేసినా, అమ్మకాలు జరిపినా వెంటనే కాల్ సెంటర్ 14405 నంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని జిల్లా కలెక్టర్ డా. కీర్తి చేకూరి తెలిపారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఎక్సైజ్, జిల్లా అధికారుల సమీక్షలో ఆమె ఈ విషయం చెప్పారు. ఫిర్యాదు చేసిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా ఉంచబడతాయని, ప్రజలు ధైర్యంగా ఫిర్యాదు చేయాలని కోరారు.

News October 6, 2025

పోలీస్ పీజీఆర్ఎస్‌కు 25 పిర్యాదులు: ఎస్పీ

image

జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ (ప్రజావాణి) కార్యక్రమానికి 25 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ నరసింహకిషోర్‌ తెలిపారు. ఎస్పీ స్వయంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి, వారి కష్టాలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి, ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, న్యాయం చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఏఎస్పీలు ఎన్‌బిఎం మురళీకృష్ణ, సుబ్బారాయుడు పాల్గొన్నారు.

News October 6, 2025

స్థానిక సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం తగదు: కలెక్టర్

image

మండల, డివిజన్ స్థాయిలో పరిష్కరించ గల సమస్యలను జిల్లా స్థాయి గ్రీవెన్స్ కార్యక్రమానికి రాకుండా స్థానిక స్థాయిలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి అధికారులను ఆదేశించారు. తహశీల్దార్, ఎంపీడీవోలు వ్యక్తిగత బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఇకపై అంశాల వారిగా అర్జీలపై మండలాలు వారిగా విశ్లేషణ చేయడం జరుగుతుందని తెలిపారు. నేటి పీజీఆర్ఎస్‌లో 149 అర్జీలు స్వీకరించారు.