News November 19, 2025
43 మంది నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు

బిహార్‌లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు సహా 43 మంది సీనియర్ నేతలకు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని వారిపై క్రమశిక్షణ కమిటీ ఈ మేరకు చర్యలు తీసుకుంది. ఈనెల 21 లోగా రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది. ఆ లోపు స్పందించకపోతే పార్టీ నుంచి తొలగింపు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.
Similar News
News March 4, 2026
అల్లు ఫ్యామిలీని చూశారా?

అల్లు శిరీష్, నయనిక ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్‌కు హాజరైన వారందరికీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ధన్యవాదాలు తెలిపారు. ‘అందమైన జంటపై ఆశీస్సులు కురిపించారు. ప్రపంచం నలుమూలల నుంచి శుభాకాంక్షలు పంపారు. మా హృదయాలు కృతజ్ఞతతో నిండిపోయాయి. మీ ప్రేమ, ఆప్యాయతకు థాంక్స్’ అని ట్వీట్ చేశారు. ఈ నెల 2న అల్లు స్టూడియోస్‌లో శిరీష్ ప్రీ వెడ్డింగ్ రిసెప్షన్ ఘనంగా నిర్వహించిన విషయం తెలిసిందే.
News March 4, 2026
ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్లస్టర్ బాంబులు!

ఇరాన్ తమ భూభాగంపైకి బాలిస్టిక్ మిస్సైళ్లతో క్లస్టర్ బాంబులు వదులుతోందని ఇజ్రాయెల్ మిలిటరీ అధికారులు వెల్లడించారు. టెల్ అవీవ్ సమీపంలో ఈ బాంబు వల్ల 12 మంది గాయపడ్డారని పేర్కొన్నారు. ఇది గాల్లో ఉన్నప్పుడే 80 చిన్న బాంబులుగా విడిపోయి కొన్ని కి.మీ. మేర విధ్వంసం సృష్టిస్తాయి. కొన్నిసార్లు పేలకుండా దశాబ్దాల పాటు భూమిలో ఉండిపోతాయి. ఏదైనా తాకితే పేలిపోతాయి. ఈ యుద్ధంలో వీటిని ఉపయోగించడం ఇదే తొలిసారి.
News March 4, 2026
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం.. 18న ప్రారంభం

AP: దివ్యాంగులకు బస్సులో ఉచిత ప్రయాణం(ఇంద్ర ధనుస్సు స్కీమ్)పై RTC MD బాలసుబ్రహ్మణ్యం కీలక ప్రకటన చేశారు. ఈ పథకాన్ని ఈ నెల 18న సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభిస్తారని తెలిపారు. 40 శాతం, ఆపైన వైకల్యం ఉన్న దివ్యాంగులు సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్, పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చన్నారు. వారికి సహాయంగా వచ్చేవారికీ 50 శాతం రాయితీ ఇస్తామని చెప్పారు.


