News November 19, 2025

మామడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం

image

మామడ మండల్ కొరిటికల్ ఎక్స్ రోడ్డు దుర్గ తండా దగ్గర ఆటో, బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. భరత్ చేయి తెగిపోయి పరిస్థితి విషమంగా ఉండగా, తుకారాం కాలు నుజ్జునుజ్జయినట్లు స్థానికులు తెలిపారు. ఇద్దరు మహారాష్ట్రకు చెందిన కూలీలని.. కోరిటికల్‌లో ఉంటున్నట్లు గుర్తించారు. పని నిమిత్తం నిర్మల్ వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

Similar News

News March 27, 2026

GNT: ‘రీసెర్చ్ నెక్సస్’ జర్నల్ ఆవిష్కరించిన జస్టిస్ రామకృష్ణ ప్రసాద్

image

వడ్లమూడి విజ్ఞాన్ వర్సిటీలో ‘రీసెర్చ్ నెక్సస్’ జర్నల్‌ను ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ ప్రసాద్ ఆవిష్కరించారు. విద్యార్థులు నిజాయతీ, నిబద్ధతతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆయన ఆకాంక్షించారు. అనంతరం ఉద్యోగాలు సాధించిన విద్యార్థుల తల్లిదండ్రులను సత్కరించారు. కార్యక్రమంలో విజ్ఞాన్ గ్రూప్ ఛైర్మన్ లావు రత్తయ్య, వైస్ ఛైర్మన్ శ్రీకృష్ణ దేవరాయలు పాల్గొని విద్యార్థులను అభినందించారు.

తుళ్లూరు: APCRDA గ్రీవెన్స్‌ డే వాయిదా

image

అమరావతి ప్రాంత రైతులు, కూలీల సమస్యల పరిష్కారానికి ప్రతి శనివారం నిర్వహించే గ్రీవెన్స్‌ డే ఈ నెల 28న జరగదని APCRDA వెల్లడించింది. కొన్ని నిర్వహణ కారణాల వల్ల శనివారం నాటి కార్యక్రమాన్ని వాయిదా వేసినట్లు అధికారులు తెలిపారు. వాయిదా పడిన ఈ ఫిర్యాదుల పరిష్కార వేదికను మార్చి 30న సోమవారం నిర్వహించనున్నట్లు ప్రకటించారు. రాజధాని ప్రాంత ప్రజలు, రైతులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.