News November 19, 2025
జగిత్యాల(R): రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి: కలెక్టర్

రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల (R) మండలంలోని నర్సింగాపూర్, అంతర్గాం, తాటిపెల్లి, మోరపెల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకం విధానాన్ని, కేంద్రాల వద్ద వసతులలో పరిశీలించారు. DRDO రఘువరణ్, DSO జితేందర్ రెడ్డి, తహశీల్దార్ వరంధన్ పాల్గొన్నారు.
Similar News
News April 6, 2026
KKR vs PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు!

IPL: కాసేపట్లో ఈడెన్ గార్డెన్స్‌లో జరిగే KKR, PBKS మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉంది. రాత్రి 8 గంటలకు వర్షం పడే ఛాన్స్ 90% ఉందని, దీంతో మ్యాచ్‌కు అంతరాయం కలగొచ్చని వెదర్ రిపోర్ట్ చెబుతోంది. అదే జరిగితే మ్యాచ్ రద్దయ్యి ఇరు జట్లకు చెరో పాయింట్ వస్తుంది. అయితే ప్రస్తుతానికి అక్కడ వాతావరణం పొడిగా ఉన్నట్లు సమాచారం. కాగా గత ఏడాది ఈడెన్‌లో జరిగిన KKR-PBKS మ్యాచ్ వర్షం కారణంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.
News April 6, 2026
వనపర్తి: ఆసుపత్రుల్లో నమోదైన OPD, IPD, రెఫర్ కేసుల వివరాలపై ఆరా!

ఏడాది కాలంలో ఆయా ఆసుపత్రుల్లో నమోదైన ఓపీడీ, ఐపీడీ, రెఫర్ కేసుల వివరాలను జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి, ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ఆరా తీశారు. వనపర్తి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి, ఎంసీహెచ్ ఆసుపత్రుల్లో ప్రస్తుతం అందిస్తున్న సేవల గురించి వివరించారు.
News April 6, 2026
ప్రణాళికాబద్ధంగా ధాన్యం కొనుగోలుకు చర్యలు: జిల్లా కలెక్టర్

ప్రణాళికాబద్ధంగా రబీ (యాసంగి) పంట ధాన్యం కొనుగోలుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో ధాన్యం కొనుగోలుపై జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. రబీ పంట కోతల ఆధారంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తూ, ధాన్యం వెంటనే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతుల నుంచి డిమాండ్ రాకముందే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కావాలన్నారు.


