News November 19, 2025
రైతులకు గుడ్‌న్యూస్.. నేడే ఖాతాల్లోకి డబ్బులు

AP: ‘అన్నదాత సుఖీభవ-పీఎం కిసాన్’ పథకంలో భాగంగా ఇవాళ రెండో విడత సాయం రైతుల ఖాతాల్లో జమ కానుంది. 46,85,838 మంది ఖాతాల్లో రూ.7,000 చొప్పున మొత్తం రూ.3,135 కోట్లను సీఎం చంద్రబాబు జమ చేయనున్నారు. కడప(D) పెండ్లిమర్రిలో మ.2గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. అటు తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల రైతుల ఖాతాల్లోకి ప్రధాని మోదీ రూ.2,000 చొప్పున పీఎం కిసాన్ సాయాన్ని నేడు రిలీజ్ చేస్తారు.
Similar News
News March 16, 2026
రైతులకు ఉచితంగా యూరియా!

TG: రైతులకు ఉచితంగా యూరియా సరఫరా కోసం వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదన సమర్పించింది. ‘రైతు భరోసా’ జాప్యం నేపథ్యంలో యూరియా ఉచిత సరఫరా వల్ల రైతులకు ఒకింత ఊరట, ప్రయోజనం కలుగుతుందని అందులో వివరించింది. గత BRS ప్రభుత్వ హయాంలోనూ రైతులకు ఉచిత యూరియా పంపిణీ చేయాలని ప్రతిపాదించినా అమలు కాలేదు. ఈసారి CM ఆమోదం తర్వాత ఆర్థిక శాఖ తుది నిర్ణయం తీసుకొని బడ్జెట్ ప్రతిపాదనలలో దీనిని చేర్చే అవకాశం ఉంది.
News March 16, 2026
సల్మాన్ ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ టైటిల్ ఛేంజ్

సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ సినిమా పేరు మారింది. దీనికి ‘మాతృభూమి- may war rest in peace’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ మేరకు సల్మాన్ Xలో పోస్టర్ షేర్ చేశారు. గల్వాన్ ఘర్షణలో వీరమరణం పొందిన తెలుగు సైనికుడు కల్నల్ సంతోష్ బాబు పాత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టీజర్ విడుదల కాగా చైనా నుంచి విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ క్రమంలోనే టైటిల్ మార్చినట్లు సమాచారం.