News November 19, 2025
విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్‌లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.
Similar News
News April 3, 2026
గతంలో మాదిరి ఉంటామంటే కుదరదు: నిమ్మల

ఇరిగేషన్ అధికారుల తీరుపై మంత్రి నిమ్మల రామానాయుడు సీరియస్ అయ్యారు. APR, MAYలో చేపట్టాల్సిన పనులపై ప్రపోజల్స్ రూపొందించకపోవడం ఏమిటని వీడియో కాన్ఫరెన్సులో ప్రశ్నించారు. ఆదివారం సాయంత్రంలోగా సమర్పించాలని, లేకుంటే స్వయంగా సంజాయిషీ ఇచ్చుకోవాలని హెచ్చరించారు. గత ప్రభుత్వంలో మాదిరే ఇంకా వ్యవహరిస్తామంటే కుదరదని, తీరు మార్చుకోవాలని స్పష్టం చేశారు. ప్రతి ఎకరాకు నీరందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
News April 3, 2026
భూ భారతి: రిజిస్ట్రేషన్ అయ్యాక మళ్లీ నో ఛేంజ్

TG: ‘భూ భారతి’లో GOVT కొత్త రూల్ పెడుతోంది. భూ యజమాని ముందు ఇంటిగ్రేటెడ్ పోర్టల్లో భూ సర్వేకు దరఖాస్తు చేస్తే సరిహద్దు రైతులకు సర్వేయర్లు నోటీసులిస్తారు. వారి సమక్షంలో సర్వే చేసి తహసీల్దార్లకు రిపోర్టు ఇస్తారు. రెవెన్యూశాఖ ఇచ్చే సర్వేపటంతో భూ భారతి పోర్టల్లో రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు రైతు దరఖాస్తు చేసుకోవాలి. సర్వేలో తేలిన విస్తీర్ణానికే రిజిస్ట్రేషన్ చేస్తారు. తరువాత మార్పునకు అవకాశం ఉండదు.
News April 3, 2026
రేపు ఆదిలాబాద్‌లో జాబ్ మేళా

ఆదిలాబాద్‌లోని గిరిజన గురుకుల డిగ్రీ కళాశాలలో ఈనెల 4న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.శివకృష్ణ తెలిపారు. పలు ప్రైవేటు కంపెనీలు పాల్గొని టెక్నికల్ ఉద్యోగాలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, టెలికాలర్‌తో పాటు పలు ఉద్యోగ అవకాశాలను కల్పించనున్నట్లు తెలిపారు. ఇంటర్, డిగ్రీ పూర్తిచేసిన వారు అర్హులన్నారు.


