News April 13, 2024
కొండపాక: దుద్దెడ చెరువు ప్రాంతంలో నెమళ్లు మృతి

కొండపాక మండలం దుద్దెడ నల్లచెరువు ప్రాంతంలో ఏడు నెమళ్లు మృతిచెందాయి. ఓ రైతు పశువులకు నీళ్లు పెట్టడానికి వెళ్తే నెమళ్లు అక్కడ పడి ఉన్నాయి. ఫారెస్ట్ అధికారులకు రైతు సమాచారాన్ని అందజేశారు. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ చందు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. 7 చనిపోగా వాటిళ్లో ఓ నెమలి బతికి ఉందని గుర్తించి వెంటనే దుద్దెడ వెటర్నరీ ఆసుపత్రికి తరలించారు. విషపు గుళికల వల్లే చనిపోయినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.
Similar News
News March 12, 2026
తూప్రాన్: విషాదం.. కొడుకు కోసం వెళ్లి తల్లి మృతి

తూప్రాన్ పట్టణ పరిధిలోని కరీంగూడకు చెందిన గోగుల లక్ష్మి(45) కొడుకును వెతికేందుకు వెళ్లిన నీటిలో మునిగి చనిపోయింది. మూడు రోజులుగా పనులకు వెళ్లిన కోడుకు కనిపించకుండా పోవడంతో నిన్న రాత్రి కొడుకును వెతికేందుకు వెళ్లిన ఆమె అల్లాపూర్ శివారులోని నీటిలో పడి మృతి చెందింది. గురువారం మృతదేహాన్ని గుర్తించగా కొడుకు ఫిర్యాదుతో తూప్రాన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News March 12, 2026
మెదక్: ఇంటర్ పరీక్షలకు 96.71 % హాజరు

మెదక్ జిల్లావ్యాప్తంగా ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా ముగిశాయి. జనరల్ విభాగంలో 6085 మందికి గాను 5895 మంది, ఒకేషనల్ విభాగంలో 279 మందికి గాను 260 మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లాలో 96.71% హాజరు నమోదైంది. నేటితో మొదటి సంవత్సరం పరీక్షలు పూర్తి కావడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏర్పాట్లు చేశారు.
News March 11, 2026
మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించాలి: కలెక్టర్ ప్రతిమా సింగ్

మెదక్ కలెక్టరేట్‌లో బుధవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రతిమా సింగ్ జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థిక అంశాలపై పట్టు సాధించి స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. మహిళల హక్కులపై అవగాహన పెంపొందించుకోవాలని ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.


