News November 19, 2025
విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్‌లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.
Similar News
News April 2, 2026
కారండులో గుర్తుతెలియని వ్యక్తి హత్య..?

కారంచేడు మండలం ఆదిపూడి రోడ్డుపై గుర్తుతెలియని ద్విచక్ర వాహనదారుడు అనుమానాస్పద స్థితిలో గురువారం మృతి చెందాడు. రోడ్డుపై మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, కేసు నమోదు చేశారు. మృతుడు ఎవరనేది ఇంకా తెలియరాలేదు. ఇది ప్రమాదమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News April 2, 2026
భద్రాద్రి: డ్రైనేజీలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం

లక్ష్మీదేవి పల్లి మండలం మెడికల్ కాలేజీ సమీపంలో ఉన్న మురుగు కాలువలో గురువారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. కాలువలో మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి, వివరాల కోసం ఆరా తీస్తున్నారు. మృతికి గల కారణాలపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
News April 2, 2026
RR: గ్రామసభలు ప్రజా సమస్యల కోసమా? ప్రచారం కోసమా?

గ్రామ సమస్యలు, అర్హులైన లబ్ధిదారుల ఎంపిక కోసం జరగాల్సిన గ్రామసభలు పక్కదారి పడుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయి సమస్యలను చర్చించాల్సింది పోయి, అధికారులు కేవలం ప్రభుత్వ పథకాలకు ‘డప్పు’ కొట్టడానికే పరిమితమవుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిరుపేదలకు అందాల్సిన పథకాలు పైరవీకారుల పాలవుతున్నాయని, అధికారులు అధికార పక్షానికి వత్తాసు పలుకుతున్నారని స్థానికులు మండిపడుతున్నారు.


