News April 13, 2024
నిర్మల్: ఆ గ్రామంలో గుక్కెడు నీళ్లు కరువు
నిర్మల్ జిల్లా బైంసా మండలం బాబుల్ గావ్ గ్రామస్తులు తాగునీటి కోసం తంటాలు పడుతున్నారు. తాగునీటి కష్టాలు లేకుండా చూడాలన్న కలెక్టర్ ఆదేశాలు కూడా
అధికారులు లెక్కచేయడం లేదు. గత రెండు దశాబ్దాలుగా ఆ గ్రామంలో నీటి సమస్య ఉన్న పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కోసం పక్క గ్రామానికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి నీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
Similar News
News February 1, 2025
ఆదిలాబాద్ అడవుల్లో హైనా సంచారం
దట్టమైన అటవీ ప్రాంతాల్లో మాత్రమే కనిపించే క్రూర మృగం హైనా ఆదిలాబాద్ జిల్లా మావల అడవుల్లో సంచరించడం కలకలం రేపుతోంది. అటవీ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో హైనా దృశ్యాలు రికార్డయ్యాయి. మావల హరితాహారం లోని సీసీ కెమెరాల్లో ఈ చిత్రం శుక్రవారం కనిపించింది. దీంతో స్థానికులు భయాందోళన చెందుతున్నారు. జిల్లాలో కొన్ని సంవత్సరాల క్రితం కనిపించకుండా పోయిన హైనాలు తిరిగి మావల అడవుల్లో కనిపించిందన్నారు.
News February 1, 2025
జాతీయస్థాయి పోటీల్లో ADBకు 10 పతకాలు
జాతీయస్థాయి తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబర్చి పతకాలు సాధించినట్లు తైక్వాండో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శివప్రసాద్, వీరేష్ పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని యూసఫ్‌గూడ ఇండోర్ స్టేడియంలో జనవరి 27 నుంచి 30వ వరకు పోటీలు జరిగినట్లు పేర్కొన్నారు. జిల్లాకు 2 స్వర్ణ, 3 వెండి, 5 రజత పతకాలు వచ్చాయన్నారు.
News February 1, 2025
శ్యాంపూర్‌లో పర్యటించిన మంత్రి సీతక్క
ఉట్నూర్ మండలం శ్యాంపూర్‌లో రాష్ట్రమంత్రి సీతక్క శుక్రవారం పర్యటించారు. గ్రామంలో కొలువుదీరిన దైవం బుడుందేవ్‌ను ఆమె శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే బొజ్జు, ఎమ్మెల్సీ విఠల్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ మల్లేష్, మాజీ ఎంపీ సోయం బాపురావు ఉన్నారు.