News April 13, 2024
ఈనెల 17 నుంచి PGECET-2024 దరఖాస్తుల స్వీకరణ

AP: పీజీఈసెట్-2024 దరఖాస్తులను ఈనెల 17 నుంచి స్వీకరించనున్నట్లు సెట్ కన్వీనర్ ఆచార్య టి.రమ్యశ్రీ తెలిపారు. మే 29, 30, 31న మొత్తం 13 సబ్జెక్టులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నట్లు వెల్లడించారు.
Similar News
News March 16, 2026
వచ్చే ఏడాదే పోలవరం జాతికి అంకితం: CBN

AP: గోదావరి పుష్కరాలకు ముందే 2027లో పోలవరాన్ని జాతికి అంకితం ఇస్తామని CM CBN పునరుద్ఘాటించారు. ‘YCP పోలవరం ప్రాజెక్టును గోదావరిలో కలిపే ప్రయత్నం చేసింది. రాజధాని లేని రాష్ట్రంలో మూడుముక్కలాట ఆడింది. కానీ అమరావతి నిర్మాణానికి పొట్టి శ్రీరాములు స్ఫూర్తితో రైతులు భూములను త్యాగం చేశారు. వారందరూ తల ఎత్తుకునేలా రాజధాని నిర్మిస్తాం’ అని పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ సందర్భంగా స్పష్టం చేశారు.
News March 16, 2026
కౌంటర్ దాఖలు చేయండి.. లిక్కర్ కేసు నిందితులకు ఢిల్లీ HC ఆదేశం

లిక్కర్ స్కామ్ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన తీర్పును సీబీఐ సవాల్ చేయగా ఢిల్లీ హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. దీనిపై కౌంటర్ ధాఖలు చేసేందుకు మరికొంత సమయం కావాలని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్, కల్వకుంట్ల కవిత సహా ఇతర నిందితులు ధర్మాసనాన్ని కోరారు. దీంతో వచ్చే నెల 5 వరకు తప్పనిసరిగా కౌంటర్ వేయాలని జస్టిస్ స్వర్ణకాంత శర్మ ఆదేశించారు. తదుపరి విచారణ APR 6కు వాయిదా చేశారు.
News March 16, 2026
ఆస్కార్ వేదికపై కోట శ్రీనివాసరావుకు నివాళి

98వ ఆస్కార్ అవార్డుల ప్రకటన సందర్భంగా గత ఏడాది కాలంలో చనిపోయిన సినీ ప్రముఖులకు అకాడమీ నివాళులర్పించింది. వీరిలో తెలుగు నటుడు కోట శ్రీనివాసరావు, బాలీవుడ్ యాక్టర్స్ ధర్మేంద్ర, సరోజాదేవి, మనోజ్ కుమార్ ఉన్నారు. రాబ్ రైనర్, రాబర్ట్ రెడ్‌ఫోర్డ్, రాబర్ట్ డువాల్, కేథరీన్ ఓహారా, డయాన్ కీటన్ వంటి హాలీవుడ్ తారలనూ అకాడమీ గుర్తు చేసుకుంది.


