News November 19, 2025

భీమవరం: వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రిక ఆవిష్కరణ

image

ఈనెల 19న వరల్డ్ టాయిలెట్ డే పురస్కరించుకొని మంగళవారం భీమవరం జిల్లా కలెక్టర్ ఛాంబర్‌లో వరల్డ్ టాయిలెట్ డే గోడ పత్రికను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి చేతుల మీదుగా ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. బహిరంగ మలమూత్ర విసర్జన చేయకపోవడం సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. బహిరంగ మలమూత్ర విసర్జన కారణంగా ప్రజలు, జంతువులు ఎన్నో వ్యాధులకు గురి అవుతున్నాయని తెలిపారు.

Similar News

News March 11, 2026

ప.గో: ఇక్కడే ఆడుకున్నాడు.. దేశానికి కీర్తి తెచ్చాడు

image

టీ20 ప్రపంచకప్ విజేతగా నిలిచిన భారత జట్టు సభ్యుడు తిలక్ వర్మ విజయం పట్ల అతడి అమ్మమ్మ ఊరు ఉండి మండలం వాండ్రంలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. మనవడి అద్భుత ప్రతిభను చూసి తాతయ్య సుబ్బరాజు, అమ్మమ్మ సుందరమ్మ అమితానందం వ్యక్తం చేశారు. చిన్ననాడు తమవద్దే ఆడుకున్న బిడ్డ నేడు దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావడం ఎంతో గర్వకారణమన్నారు. మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు మనసారా ఆకాంక్షించారు.

News March 11, 2026

ప.గో: గ్యాస్ బుకింగ్‌లో కొత్త నిబంధనలు

image

గ్యాస్ బుకింగ్ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు జిల్లాలో వినియోగదారులకు ఇబ్బందికరంగా మారింది. ఓవైపు సిలిండర్ ధరలు పెరగగా మరోవైపు గతంలో సింగిల్ బండ 15 రోజులు బుక్ చేసుకునే సౌకర్యం ఉండేది. కొత్త నిబంధనల ప్రకారం సింగిల్ బండ ఓనర్ 25 రోజుల తర్వాత, డబుల్ బండ వారు 30రోజుల తర్వాత మాత్రమే గ్యాస్ బుక్ చేసుకోవాలని నిబంధనలు తీసుకొచ్చింది. ఈ నిబంధన భారంగా మారిందని వినియోగదారులు వాపోతున్నారు.

News March 11, 2026

ప.గో: అసభ్య పదజాలం.. ఫొటోలతో వివాహితకు బెదిరింపులు

image

ఫోన్ ద్వారా వివాహితను అసభ్య పదజాలంతో దూషిస్తూ, సోషల్ మీడియాలో ఫొటోలు పెడతానంటూ బెదిరిస్తున్న వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కథనం.. నరసాపురం టౌన్‌లోని ఓ వివాహితను ఏడాదిగా గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ ద్వారా వేదిస్తున్నారు. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు నరసాపురం టౌన్ ఎస్ఐ ఎస్.ముత్యాలరావు కేసు నమోదు చేశారు. నిందితుడిని గుర్తించేందుకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.