News November 19, 2025

అనకాపల్లి జిల్లాలో 2,42,480 రైతులకు లబ్ధి: కలెక్టర్

image

అనకాపల్లి జిల్లాలో అన్నదాత సుఖీభవ- పీఎం కిసాన్ పథకం కింద 2,42,480 మంది రైతులు లబ్ధి పొందనున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. 19వ తేదీన రైతుల ఖాతాల్లో రూ.158.4 కోట్లు జమ కానున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో 22,300, చోడవరంలో 51,260, మాడుగులలో 45,340, నర్సీపట్నంలో35,040, పాయకరావుపేటలో 39,300, ఎలమంచిలిలో 33,760 మంది రైతులు లబ్ధి పొందుతున్నట్లు తెలిపారు.

Similar News

News March 27, 2026

కొత్తగూడెం రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలి

image

భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ ఏర్పడి వందేళ్లు పూర్తవుతుంది. ఈ సందర్భంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ చారిత్రక నేపథ్యాన్ని కొనసాగించాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర శుక్రవారం పార్లమెంట్ ఆవరణలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు విన్నవించారు. మంత్రికి వినతిపత్రం అందజేసి కొత్తగూడెం కేంద్రంగా కొత్త రైల్వే డివిజన్ నెలకొల్పాలని వినతి పత్రం ఇచ్చారు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత సురేష్ రెడ్డి ఉన్నారు.

News March 27, 2026

కేసీఆర్ యాదాద్రి అభివృద్ధి.. రేవంత్ భద్రాద్రిపై ఫోకస్

image

పదేళ్ల పాలనలో యాదాద్రి అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చిన మాజీ సీఎం కేసీఆర్, భద్రాచలం విషయంలో నిర్లక్ష్యం వహించారనే విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి భద్రాద్రిపై ప్రత్యేక దృష్టి సారించి నేడు శ్రీరామనవమి సందర్భంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. తొలి దశలో రూ.351 కోట్లు విడుదల చేసి గోదావరి కరకట్ట, భక్తులకు వసతులు, ఆలయ విస్తరణ వంటి పనులు చేపట్టనున్నారు.

News March 27, 2026

ఒంటిమిట్ట కళ్యాణానికి తలంబ్రాలు సిద్ధం

image

ఒంటిమిట్టలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో ఏప్రిల్ ఒకటో తేదీ సీతారాముల కళ్యాణం జరగనుంది. ఈ మేరకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కళ్యాణోత్సవానికి అవసరమైన తలంబ్రాల తయారీ ప్రారంభమైంది. సుమారు 1.60 లక్షల ప్యాకెట్ల తలంబ్రాలు సిద్ధం చేస్తున్నారు. కడప, అన్నమయ్య జిల్లాల నుంచి వచ్చిన 600 మంది శ్రీవారి సేవకులు ఇందులో పాల్గొంటున్నారు.