News November 19, 2025
ఈ జిల్లాల్లో తీవ్ర చలిగాలులు

TG: రాష్ట్రంలోని ఉత్తర, పశ్చిమ జిల్లాల్లో ఇవాళ చలి గాలులు తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. కొమురం భీమ్, JGL, సిరిసిల్ల, సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, ADB, NZB, కామారెడ్డి జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు అత్యల్పంగా ఉంటాయంది. నిన్న కనిష్ఠంగా సిర్పూర్‌లో 6.8 డిగ్రీలు నమోదైనట్లు పేర్కొంది. NOV 22న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, 22 నుంచి 3 రోజులు వర్షాలు పడతాయని పేర్కొంది.
Similar News
News November 19, 2025
BRS రైతులను మోసం చేసింది: ఆడే గజేందర్

రైతుల సంక్షేమం గురించి బీఆర్ఎస్ నాయకులు మాట్లాడటం విడ్డూరంగా ఉందని బోథ్ నియోజకవర్గ అసెంబ్లీ ఇన్‌ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. ADB కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు. గతంలో రుణమాఫీ అంటూ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్నారు. ఏకకాలంలో రూ.2 లక్షల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందన్నారు.
News November 19, 2025
ఈవీల విక్రయాల్లో MG విండ్సర్ రికార్డ్

ఈవీ కార్ల అమ్మకాల్లో MG విండ్సర్ రికార్డులు బద్దలు కొడుతోంది. భారత్‌లో 400 రోజుల్లోనే 50వేల యూనిట్లు విక్రయించినట్లు సంస్థ తాజాగా ప్రకటించింది. నెలకు 3,800పైగా కార్ల చొప్పున విక్రయాలు జరిగినట్లు పేర్కొంది. భారతీయ మార్కెట్లో అత్యంత వేగంగా 50వేల మార్కును అందుకున్న ఫోర్ వీలర్ ఈవీగా నిలిచినట్లు వెల్లడించింది. బ్రిటన్‌కు చెందిన MG.. ఇండియాలో JSWతో జతకట్టి తమ కార్ల విక్రయాలు ప్రారంభించింది.
News November 19, 2025
సూసైడ్ బాంబర్ వీడియోలు తొలగించిన META

ఢిల్లీ ఎర్రకోట వద్ద ఆత్మాహుతికి పాల్పడిన సూసైడ్ బాంబర్ ఉమర్ సెల్ఫీ వీడియో SMలో వైరలైన విషయం తెలిసిందే. వాటిని META సంస్థ తమ ప్లాట్ ఫామ్స్ నుంచి తొలగించింది. తమ యూజర్ గైడ్ లైన్స్‌కు విరుద్ధంగా ఉన్న నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. ‘నాది ఆత్మహత్య కాదు.. <<18318092>>బలిదానం<<>>’ అని ఉమర్ ఆ వీడియోలో సమర్థించుకున్నాడు. అయితే ఈ వీడియో ట్విటర్‌లో అందుబాటులోనే ఉండటం గమనార్హం.


