News November 19, 2025
VZM: ‘100 రోజుల యాక్షన్ ప్లాన్‌కు సిద్ధం కావాలి’

పదో తరగతిలో ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు డిసెంబర్ 5వ తేదీ లోపు సిలబస్ పూర్తిచేయాలని DEO మాణిక్యం నాయుడు సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడారు. గత ఏడాది 87% పాస్ రేట్‌తో 7వ స్థానంలో నిలిచిందన్నారు. ఈసారి మరింత మెరుగైన ఫలితాల సాధనకు ఉపాధ్యాయులందరూ కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. మొత్తం సిలబస్ పూర్తి చేసి, 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకారం ప్రత్యేక క్లాసులు నిర్వహించాలని అన్నారు.
Similar News
News March 21, 2026
VZM: ‘క్రమశిక్షణ, సేవాభావంతో ఉన్నత శిఖరాలు సాధ్యం’

మహాశివరాత్రి సందర్భంగా రామతీర్థం, పుణ్యగిరి ఆలయాల్లో భక్తుల క్యూలైన్ నిర్వహణలో సహకరించిన ఎన్‌సీసీ విద్యార్థులను జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ తన కార్యాలయంలో శనివారం అభినందించారు. విద్యార్థులు క్రమశిక్షణతో మెలిగి, భవిష్యత్తుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని సూచించారు. ఎన్‌సీసీ ద్వారా సేవాభావం పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు.
News March 20, 2026
గ్యాస్ పొదుపుగా వాడుకోవాలి: VZM కలెక్టర్

జిల్లాలో గృహ వినియోగ గ్యాస్‌కు ఎలాంటి కొరత లేదని, డిమాండ్‌కు సరిపడా సరఫరా జరుగుతోందని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి తెలిపారు. సీఎం చంద్రబాబు శుక్రవారం నిర్వహించిన VC అనంతరం ఆయన మాట్లాడారు. ప్రజలు ఆందోళన చెందవద్దని సూచించారు. అవసరానికి మించి గ్యాస్ బుకింగ్ చేయకుండా, పొదుపుగా వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. డిమాండ్-సప్లై అంతరాన్ని తగ్గించేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను అదేశించారు.
News March 20, 2026
గోదావరిలో విజయనగరం విద్యార్థి గల్లంతు

ఎటపాక మండలం పురుషోత్తపట్నం వద్ద గోదావరి నదిలో <<19432323>>గల్లంతైన<<>> ఐదుగురు యువకులు అమరావతిలోని ఎస్ఆర్ఎం కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నట్లు పోలీస్ అధికారులు చెబుతున్నారు. సతీశ్(మదనపల్లి), నవదీప్ (ఉయ్యూరు), తేజజ్ఞ(ఉయ్యూరు), శ్రీకర్(భద్రాచలం), అభిరామ్(విజయనగరం) అని తేల్చారు. వీరంతా బీటెక్ సెకండియర్ చదువుకుంటున్నారన్నారు. ఏడుగురు గోదావరిలో దిగగా ఇద్దరు సురక్షితంగా బయటపడ్డారన్నారు.


