News November 19, 2025
విశాఖలో నాకు తెలియని వీధి లేదు: బాలకృష్ణ

లక్ష్మీనరసింహస్వామి జన్మ నక్షత్రమైన స్వాతి నక్షత్రం రోజున అప్పన్నను దర్శించుకోవడం దైవ నిర్ణయం అని బాలకృష్ణ అన్నారు. అఖండ-2 సాంగ్ రిలీజ్ నేపథ్యంలో విశాఖతో తనకున్న అనుభవాలను పంచుకున్నారు. ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక రాజధాని విశాఖలో తనకు తెలియని వీధి అంటూ లేదని, ప్రతి వీధిలో షూటింగ్ చేశానని అన్నారు. లెజెండ్ షూటింగ్ సందర్భంగా ఆర్కేబీచ్‌లో అద్దాన్ని పగలగొట్టుకుంటూ గుర్రంపై వెళ్లానని గర్తు చేసుకున్నారు.
Similar News
News March 15, 2026
అకౌంట్లలోకి రూ.6,000.. మొదట వీరికే!

TG: అన్నదాతలకు పెట్టుబడి సాయం కింద ఈ నెల 22న ‘రైతుభరోసా’ నిధులు <<19391741>>విడుదల<<>> చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి విడతగా ఎకరం వరకు ఉన్న 70 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.6,000 చొప్పున జమ చేయనుంది. ఇందుకోసం సర్కార్ రూ.3,590 కోట్లు వెచ్చించనుంది. ఇక 20 రోజుల తర్వాత రెండో విడత, ఏప్రిల్ నెలాఖరులోపు మూడో విడత డబ్బులు రిలీజ్ చేయనుంది. కాగా రైతుభరోసా ద్వారా ఏడాదికి రూ.12వేలు అందిస్తామని ప్రభుత్వం తెలిపింది.
News March 15, 2026
పదో తరగతి విద్యార్థులకు కలెక్టర్ సూచనలు

పదో తరగతి పరీక్షలు రాసే విద్యార్థులు ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా ఉండాలని కలెక్టర్ రాజాబాబు సూచించారు. ముఖ్యంగా సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. ఓఎంఆర్ షీట్‌లోని సబ్జెక్టు కోడ్, రూమ్ నెంబర్ వంటి వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని తెలిపారు. విద్యార్థులు క్రమశిక్షణతో పరీక్షలు రాయాలని ఆయన దిశానిర్దేశం చేశారు.
News March 15, 2026
కర్నూలు: ప్రేమ పేరుతో ట్రాన్స్ జెండర్‌ను మోసం చేసిన ఘనుడు

ఓర్వకల్లు మండలం హుసేనాపురానికి చెందిన ట్రాన్స్‌జెండర్ గీతను, చిన్నటేకూరుకు చెందిన పరశురాం ప్రేమ పేరుతో వంచించినట్లు బాధితురాలు ఆరోపించింది. 2024 నుంచి పరిచయం పెంచుకుని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన వద్ద నుంచి రూ.22 లక్షలు వసూలు చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఇప్పుడు డబ్బు అడిగితే అసభ్యకరంగా దూషిస్తూ, తన స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి చంపేస్తానని బెదిరిస్తున్నాడని గీత పోలీసులను ఆశ్రయించింది.


