News April 13, 2024
అథ్లెటిక్స్ పోటీలకు రేపు క్రీడాకారుల ఎంపిక
పాల్వంచ: ఈనెల 28న సూర్యాపేటలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జిల్లా స్పోర్ట్ అథారిటీ మైదానంలో క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె.మహీధర్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 14, 16, 18, 20 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 99636 59598ను సంప్రదించాలన్నారు.
Similar News
News November 25, 2024
ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి : తుమ్మల
ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్టు ఏర్పాటుకు కృషి చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు. ఖమ్మంలో వన సమారాధన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం జిల్లాలో ఎయిర్ పోర్ట్ ఏర్పాటైతే మరింత అభివృద్ధి జరుగుతుందన్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడును కలిసి వినతి పత్రం సమర్పించినట్లు గుర్తు చేశారు.
News November 25, 2024
ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యాంశాలు
∆} భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన ∆} మధిరలో ప్రజా పాలన విజయోత్సవ కార్యక్రమం ∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన ∆} బూర్గంపాడులో ఎమ్మెల్యే పాయం పర్యటన ∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు ∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం ∆} వైరాలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
News November 25, 2024
ఖమ్మం: సర్వే డేటా ఎంట్రీ కీలకం: భట్టి
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే చివరి దశకు చేరుకున్నదని, సర్వే డేటా ఎంట్రీ చాలా కీలకమైందని, ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం ఇవ్వొద్దని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతెలిపారు. భట్టి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో 5,68,493 ఇండ్లను సర్వే కోసం గుర్తించామని, ఈనెల 23 నాటికి మొత్తం 4,78,868 ఇండ్ల సర్వే పూర్తయిందని జిల్లా కలెక్టర్ వివరించారు.