News November 17, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 118 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మందు బాబులు వాహనాలు నడపడం కారణంగా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకై వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఆదివారం నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 118 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ పరిధిలోనే 60 కేసులు ఉన్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని, వాహనం సీజ్ చేసి కౌన్సిలింగ్ ఇస్తామని పోలీసులు వాహనదారులను హెచ్చరించారు.
Similar News
News November 17, 2025
కేయూ: ఆ సభ్యుల నియామకంపై SFI తీవ్ర అభ్యంతరం

కాకతీయ యూనివర్సిటీ విచారణ కమిటీల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తులను సభ్యులుగా పెట్టడాన్ని SFI తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గత కమిటీ నివేదికలపై చర్యలు తీసుకోకపోవడం అధికార దుర్వినియోగమని పేర్కొంటూ ప్రిన్సిపల్, హాస్టల్ ఛైర్మన్ ఆధ్వర్యంలో కొత్త కమిటీ ఏర్పాటుకు విద్యార్థి సంఘం డిమాండ్ చేసింది. అందుకు సంబంధించి ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ప్రొఫెసర్ రామచంద్రానికి వినతిపత్రం అందించింది.

తిరుపతి: చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ డిస్మిస్

నెల్లూరు ఏసీబీ కోర్టులో సోమవారం టీటీడీ కల్తీ నెయ్యి కేసుతో సంబంధం ఉన్న చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్‌ను డిస్మిస్ అయ్యింది. ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది జయశేఖర్ వాదనలతో ఏకీభవిస్తూ న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేశారు. 2 సార్లు హవాలా ద్వారా చిన్న అప్పన్న డెయిరీ కంపెనీ ప్రతినిధుల నుంచి రూ.20 లక్షలు, రూ.30 లక్షలు ఢిల్లీ పటేల్ నగర్ వద్ద 2023లో తీసుకున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.