News November 19, 2025

అయినవిల్లి లంక: కుమారుని మృతదేహాన్ని దానం చేసిన తల్లి

image

సమాజానికి సేవ చేయాలనే సంకల్పంతో కుమారుని శరీరాన్ని వైద్య విద్యార్థులకు తల్లి దానం చేసిన ఘటన అయినవిల్లిలంకలో జరిగింది. 80 ఏళ్ల చిట్టూరి సీతారత్నం కుమారుడు అచ్యుత రామన్న చౌదరి (గోపి)(45) మరణించాడు దీంతో తల్లి కిమ్స్ వైద్య కళాశాలకు మృతదేహాన్ని అప్పగించారు. కిమ్స్ అనాటమీ విభాగాధిపతి నారాయణరావు మృతుని తల్లికి మంగళవారం అవయవదాన పత్రం అందజేశారు.

Similar News

News March 19, 2026

సూర్యాపేట, కోదాడ మీదుగా రైలు మార్గం

image

విజయవాడ–హైదరాబాద్ మధ్య 4వ రైల్వే మార్గాన్ని దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదించింది. ఈ మార్గం కోదాడ, సూర్యాపేట, నార్కెట్‌పల్లి, మహేశ్వరం మీదుగా వెళ్లనుంది. ప్రతిపాదన ఆమోదం పొందితే ఈ ప్రాంతాలకు రైలు సౌకర్యం కలగనుంది. ప్రస్తుతం బస్సులపై ఆధారపడుతున్న ప్రజలకు ఇది పెద్ద ఊరట. ఈ రైలు మార్గం విద్య, వ్యాపారం, పారిశ్రామిక రంగాల్లో అభివృద్ధికి దోహదపడనుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

News March 19, 2026

NTR: మహిళా శిశు సంక్షేమ శాఖలో పోస్టుల భర్తీ

image

తిరువూరులోని సఖి వన్‌స్టాప్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న 13 పోస్టుల భర్తీకి మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. 18-42 ఏళ్లలోపు వయస్సున్న అర్హులైన మహిళా అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోపు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా అధికారి రుక్సానా బేగం తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను విజయవాడ మారుతీనగర్‌లోని జిల్లా కార్యాలయంలో అందజేయాలని సూచించారు.

News March 19, 2026

అనుష్క పెళ్లి.. టీమ్ క్లారిటీ

image

ఈ ఏడాదే అనుష్క శెట్టి పెళ్లంటూ వస్తున్న రూమర్స్‌ను ఆమె టీమ్ కొట్టిపారేసింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారంలో నిజం లేదని ప్రకటించింది. అధికారిక సమాచారం లేకుండా ఎలాంటి వార్తలను పబ్లిష్ చేయొద్దని మీడియాను కోరింది. అలాగే అనుష్క ఏజ్‌కు సంబంధించిన ప్రస్తావన పదే పదే తీసుకురావడం ఆమె ప్రైవసీకి భంగం కలిగించడమేనని పేర్కొంది. వ్యక్తిగత విషయమైన పెళ్లిపై ఇలా రూమర్స్ సృష్టించడం సరికాదని తెలిపింది.