News April 13, 2024
జైపూర్ మ్యూజియంలో కోహ్లీ మైనపు విగ్రహం

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి మరో అరుదైన గౌరవం లభించింది. జైపూర్‌లోని మ్యూజియంలో ఆయన మైనపు విగ్రహం ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించిన విగ్రహాన్ని ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ నెల 18న వరల్డ్ హెరిటేజ్ డే సందర్భంగా కింగ్ కోహ్లీ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. కాగా ఇప్పటికే ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలోనూ కోహ్లీ మైనపు విగ్రహం ఉంది.
Similar News
News April 2, 2026
జగన్ ‘మావిగన్’పై చంద్రబాబు రియాక్షన్ ఇదే..

AP: అమరావతి పేరు పలకడానికి కూడా జగన్ ఇష్టపడటం లేదని, అందుకే వింత పేరు తీసుకొచ్చారని CM CBN విమర్శించారు. మావిగన్ పేరు పెట్టాలనడం ద్వేషానికి పరాకాష్ఠ అని మండిపడ్డారు. అమరావతిపై ఆయన వైఖరి మారదని స్పష్టమైందని కూటమి నేతలతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో అన్నారు. రాజధాని బిల్లును ఆమోదించిన కేంద్రానికి ప్రతిఒక్కరూ ధన్యవాదాలు తెలపాలని, తాను మధ్యాహ్నం ఉద్దండరాయునిపాలెంలో సంబరాల్లో పాల్గొంటానని చెప్పారు.
News April 2, 2026
ఒళ్లంతా సిందూరం.. ఇదే హనుమ కథ

హనుమంతుడు ఒళ్లంతా సిందూరం పూసుకొని ఉండటం వెనుక ఓ ఆసక్తికరమైన పురాణ గాథ ఉంది. సీతమ్మ తన నుదుటన సిందూరం ధరించడం వెనుకున్న విశేషాన్ని హనుమ అడిగారట. శ్రీరాముడి ఆయురారోగ్యాల కోసమని ఆమె చెప్పడంతో.. తన ప్రభువుకి మరింత మేలు జరుగుతుందని ఆంజనేయుడు దానిని తన శరీరం అంతటా పూసుకుంటాడు. ఆయన అమాయకత్వంతో కూడిన భక్తికి ముగ్ధుడైన రాముడు.. సిందూరంతో హనుమను పూజించే భక్తులకు అన్ని కష్టాలు తొలగుతాయని వరం ఇచ్చారు.
News April 2, 2026
హనుమాన్: భక్తుడే కాదు.. గొప్ప రక్షకుడు కూడా!

హనుమంతుడు శ్రీరాముడి పరమ భక్తుడే కాదు. ఆపదల్లో ఆదుకునే రక్షకుడు కూడా. అందుకు కురుక్షేత్రంలోని ఈ ఘటనే నిదర్శనం. యుద్ధంలో అర్జునుడి రథంపై హనుమాన్ ఉంటాడన్న విషయం తెలిసిందే. అయితే ఆ యుద్ధం ముగిశాక అర్జునుడు రథం దిగిన వెంటనే అది బూడిదైంది. శత్రువులు వేసిన అస్త్రాల శక్తిని కృష్ణుడితో పాటు హనుమంతుడు కూడా తన దివ్యశక్తితో ఆపి, అర్జునుడిని కాపాడాడు. అందుకే హనుమంతుడిని ఆపద్బాంధవుడు అంటారు.


