News November 19, 2025

‘అరట్టై’ నుంచి బిగ్ అప్డేట్..

image

దేశీ మెసేజింగ్ యాప్ ‘అరట్టై’లో బిగ్ అప్డేట్‌ను జోహో సంస్థ తీసుకొచ్చింది. ‌ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ను ప్రవేశపెట్టింది. ఇకపై డైరెక్ట్ చాట్‌లకు ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుందని జోహో తెలిపింది. కొత్త వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని యూజర్లను కోరింది. ఎండ్ టు ఎండ్ ఎన్‌క్రిప్షన్‌ వల్ల మెసేజ్‌ను పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారే చూస్తారని చెప్పింది. గ్రూప్ చాట్స్‌కూ త్వరలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది.

Similar News

News March 17, 2026

VZM: పాసుపుస్తకాల పంపిణీ వేగవంతం చేయాలి

image

జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీని వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్‌.రాంసుందర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర స్థాయి వీసీ అనంతరం మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి నెలా 9వ తేదీలోపు పంపిణీ పూర్తి చేయాలని సూచించారు. ఎలాంటి తప్పులు లేకుండా పాసుపుస్తకాలు తయారు చేయాలని, రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పారు. మ్యుటేషన్లను కూడా త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

News March 17, 2026

బెంగాల్‌లో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదు: మమతా బెనర్జీ

image

బెంగాల్‌లో BJPకి గతం కంటే ఈసారి సీట్లు తగ్గుతాయని సీఎం మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని ఆటలాడినా ఆ పార్టీకి ఏ మాత్రం గెలిచే అవకాశం లేదన్నారు. ఈ ఎన్నికల్లో ‘బెంగాల్’ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తమ రాష్ట్రంలో ‘ఢిల్లీ కా లడ్డూ’ పని చేయదని ఎద్దేవా చేశారు. కాగా WBలో మొత్తం 294 సీట్లకు గాను TMC 291 చోట్ల పోటీ చేస్తోంది. 3 సీట్లను మిత్రపక్షం BGPMకు కేటాయించింది.

News March 17, 2026

‘ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే యుద్ధం’.. అమెరికా ఉన్నతాధికారి రాజీనామా

image

ఇరాన్‌తో యుద్ధం వేళ అమెరికా నేషనల్ కౌంటర్‌టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్.. ట్రంప్‌కు షాకిచ్చారు. తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ‘ఇరాన్‌తో అమెరికా యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. మన దేశానికి ఇప్పటికిప్పుడు ఇరాన్‌తో ఎలాంటి ముప్పు వచ్చే అవకాశం లేదు. కానీ ఇజ్రాయెల్, బలమైన అమెరికన్ లాబీ ఒత్తిడి వల్లే అమెరికా యుద్ధంలోకి దిగినట్లు స్పష్టం అవుతోంది’ అని పేర్కొన్నారు.