News November 17, 2025
ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు!

రంజీ ట్రోఫీలో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా 8 వికెట్లతో రాణించారు. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తొలి 5 వికెట్లను పడగొట్టిన శుక్లా, మొత్తంగా 20 ఓవర్లలో 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశారు. అతడి దెబ్బకు హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111 రన్స్‌కే ఆలౌటైంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టారు.
Similar News
News November 17, 2025
ESIC ఆల్వార్‌లో 252 పోస్టులు

రాజస్థాన్ ఆల్వార్‌లోని ESIC 252టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 24, 25 తేదీల్లో ఇంటర్వ్యూకు హాజరుకావొచ్చు. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్, ఎండీ, ఎంఎస్, డీఎన్బీ, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBD, మహిళలకు ఫీజు లేదు. వెబ్సైట్: https://esic.gov.in/

ఢిల్లీ బ్లాస్ట్‌లో 15మంది మృతి: పోలీసులు

ఎర్రకోట వద్ద జరిగిన పేలుడు ఘటనలో NIA, ఢిల్లీ పోలీసులు విచారణ వేగవంతం చేశారు. మరోవైపు మృతుల సంఖ్యపై కూడా ఓ స్పష్టతనిచ్చారు. ఇప్పటివరకు ఈ పేలుడు ఘటనలో 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. అటు సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి సహకరించాడన్న అనుమానంతో కశ్మీరుకు చెందిన అమీర్ రషీద్ అలీని నిన్న NIA <<18306148>>అరెస్టు <<>>చేసిన విషయం తెలిసిందే. అతడిని కశ్మీర్‌కు తీసుకెళ్లి తదుపరి విచారణ కొనసాగించనుంది.