News April 13, 2024
ప్రకాశం: సముద్రంలో గల్లంతైన యువకుడు మృతి

దొనకొండ మండల కేంద్రానికి చెందిన సయ్యద్ ఇర్ఫాన్ (38) అనే వ్యక్తి ఒంగోలు ఇస్లాంపేటలో నివాసం ఉంటున్నాడు. స్నేహితులతో సరదాగా కొత్తపట్నం కె.పల్లెపాలెం బీచ్ కు వచ్చి సముద్రంలో స్నానం చేస్తూ అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోతుండగా మత్స్యకారులు బయటకులాగారు. కొన ఊపిరితో ఉండగా, స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు నిర్ధారించారు.
Similar News
News April 22, 2025
ప్రకాశం: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

ఉమ్మడి ప్రకాశం జిల్లా బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద మంగళవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గుర్తుతెలియని వాహనం ఢీకొడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా బిక్షాటన చేస్తుంటుందని స్థానికులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News April 22, 2025
S.N పాడు: అధ్యాపక పోస్టులకు నేడే ఇంటర్వ్యూలు

సంతనూతలపాడు మండలం మైనంపాడు డైట్ కళాశాలలో అధ్యాపక పోస్టులకు నేడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లుగా జిల్లా విద్యాశాఖ అధికారి కిరణ్ కుమార్ తెలిపారు. కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులకు మంగళవారం ఉదయం తొమ్మిది గంటలకు డిప్యూటేషన్ పద్ధతిలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
News April 22, 2025
ప్రకాశం: విద్యార్థుల కోసం ఇంటి బాట పట్టిన ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థుల కోసం ఇంటి బాట పడుతున్నారు. విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బడిబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఉపాధ్యాయులు తమ పరిధిలోని గ్రామాలలో తిరుగుతూ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలలపై ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం సోమవారం నుంచి ప్రారంభం అయింది.