News November 19, 2025
భూపాలపల్లి జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటు: ఎంపీ

భూపాలపల్లి జిల్లా అభివృద్ధి కోసం ఉన్న వనరులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, బొగ్గు రవాణా వల్ల రహదారులు పాడవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్లు ఎంపీ తెలిపారు. భూపాలపల్లి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
Similar News
News March 13, 2026
రాజమండ్రి: రేపు ‘జాతీయ లోక్ అదాలత్’

మార్చి 14న ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. కాకినాడ, కోనసీమ, రాజమండ్రి, రంపచోడవరం పరిధిలోని కక్షిదారులు తమ పెండింగ్ కేసులను రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని కోరారు. కోర్టుల చుట్టూ తిరిగే శ్రమ, ఖర్చు తగ్గించుకోవడానికి ఇది మంచి అవకాశమని, ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు.
News March 13, 2026
బాపట్ల జిల్లాను బాల కార్మిక రహితంగా మార్చాలి

బాపట్ల జిల్లాను బాల కార్మిక రహిత జిల్లాగా మారాలని డీఆర్ఓ జి. గంగాధర్ గౌడ్ అన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా స్థాయి బాల కార్మిక నిర్మూలన కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. 14 ఏళ్లలోపు పిల్లలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లోనే ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పరిశ్రమలు, ఇటుక బట్టీలు, హోటళ్లు, దాబాలు, దుకాణాల వద్ద క్రమం తప్పకుండా తనిఖీలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
News March 13, 2026
కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 180 మంది గైర్హాజరు

కర్నూలు జిల్లాలో శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు 180 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 16,116 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 15,936 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలో ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని ఆయన స్పష్టం చేశారు. పరీక్షలు అత్యంత పారదర్శకంగా, నిబంధనల మేరకు నిర్వహించినట్లు ఆయన పేర్కొన్నారు.


