News April 13, 2024

వాట్సాప్‌లో అదిరిపోయే ఫీచర్

image

వాట్సాప్‌లో ‘నోట్స్’ పేరిట మరో కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. బిజినెస్ టూల్‌గా పనిచేసే ఈ ఫీచర్‌తో యూజర్లు తమ కస్టమర్లకు సంబంధించిన వివరాలను చాట్ ఇన్ఫో సెక్షన్‌లో నోట్స్‌గా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రైవేటుగా ఉంటుంది. ఇతరులకు కనిపించదు. ఈ ఫీచర్ మొదట్లో సాధారణ యూజర్లకు అందుబాటులో ఉండదని, బిజినెస్ అకౌంట్స్‌కి మాత్రమే అందుబాటులోకి వస్తుందని వాబీటా ఇన్ఫో పేర్కొంది.

Similar News

News October 11, 2024

నెట్స్‌లో చెమటోడ్చుతున్న హిట్‌మ్యాన్

image

న్యూజిలాండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ నెట్స్‌లో తీవ్రంగా శ్రమిస్తున్నారు. గంటలపాటు ఆయన బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారు. కాగా ఈ నెల 16 నుంచి న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో తొలి టెస్టు జరగనుంది. రెండో టెస్టు పుణే, మూడో టెస్టు ముంబైలో జరగనున్నాయి.

News October 11, 2024

ఇరాన్, ఇజ్రాయెల్, లెబనాన్‌ల మధ్య హెచ్చరికలు, విజ్ఞ‌ప్తులు

image

ఇజ్రాయెల్ దురాక్ర‌మ‌ణ‌ల‌కు దిగితే క‌ఠిన చ‌ర్య‌ల‌కు సిద్ధమని ఇరాన్ హెచ్చరించింది. ఇక లెబ‌నాన్ నుంచి ప్ర‌యోగించిన‌ 25 రాకెట్లలో కొన్నింటిని ఇంట‌ర్సెప్ట్ చేసినట్టు ఇజ్రాయెల్ ప్ర‌క‌టించింది. మరోవైపు పౌరులు, జ‌నావాసాల‌పై ఇజ్రాయెల్ దాడులు నిలిపివేయాల‌ని లెబ‌నాన్ కోరింది. గురువారం జ‌రిగిన దాడుల్లో 139 పౌరులు మృతి చెందిన‌ట్టు తెలిపింది. UN తీర్మానం మేరకు కాల్పుల విర‌మ‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉండాల‌ని కోరింది.

News October 11, 2024

ఆ రూ.లక్షన్నర కోట్లు ఎక్కడి నుంచి తెస్తారు: కిషన్ రెడ్డి

image

TG: పేదల ఇళ్ల కూల్చివేతల విషయంలో హైడ్రా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం తగదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి హితవు పలికారు. ‘ఇళ్లను కూల్చివేస్తే బ్యాంకు రుణాలు ఎవరు చెల్లిస్తారు? పేదలతో చర్చించి, వారికి ప్రత్యామ్నాయం చూపించాకే ముందుకు వెళ్లాలి. డ్రైనేజీ వ్యవస్థకు ప్రత్యామ్నాయం లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యం? మూసీ సుందరీకరణకు రూ.లక్షన్నర కోట్లను ప్రభుత్వం ఎక్కడి నుంచి సమీకరిస్తుంది’ అని ప్రశ్నించారు.