News April 13, 2024
VZM: ఒకేరోజు 123 మంది వాలంటీర్స్ రాజీనామా

పార్వతీపురం మన్యం జిల్లాలో శుక్రవారం ఒక్క రోజు 123 మంది వాలంటీర్స్ రాజీనామా చేశారని అధికారులు తెలిపారు. పాచిపెంట , సీతం పేట, వీరఘట్టం, గరుగుబిల్లి, జియమ్మవలస గ్రామ వాలంటీర్స్ రాజీనామా చేస్తూ ఆయా మండలాలలో సంబంధిత అధికారులకు రాజీనామా పత్రాలను అందజేశారు. ఎన్నికల కోడ్ తో తమను దూరం పెట్టడంతో రాజీనామా చేసినట్లు వాలంటీర్స్ తెలిపారు.
Similar News
News October 6, 2025
VZM: జీవితం అంటే సంపూర్ణమైన ఆరోగ్యం

జీవితం అంటే సంపూర్ణ ఆరోగ్యమని జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి, హోం శాఖామంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. కలెక్టరేట్ ఆడిటోరియంలో సోమవారం సాయంత్రం జరిగిన స్వచ్ఛాంధ్ర-2025 జిల్లా స్థాయి అవార్డుల ప్రధానోత్సవానికి ఆమె ముఖ్య అతిధిగా హాజరయ్యారు. మొత్తం 48 మంది వ్యక్తులు, సంస్థలకు ఈ అవార్డులను పంపిణీ చేశారు. ప్రజలు ఆరోగ్యంగా ఉండటంలో పారిశుద్ధ్య కార్మికులు పాత్ర చాలా కీలకమన్నారు.
News October 6, 2025
సూపర్ జీఎస్టీ క్యాంపెయిన్‌పై కలెక్టర్ సమీక్ష

సూపర్ GST క్యాంపెయిన్ లో షెడ్యూల్ లో ఇచ్చిన లక్ష్యాల మేరకు ఏ రోజు కార్యక్రమాలను ఆ రోజే పూర్తి చేయాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. సోమవారం తన ఛాంబర్‌లో అధికారులు సిబ్బందితో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. అన్ని పాఠశాలల్లో, కళాశాలల్లో సూపర్ జీఎస్టిపై అవగాహనా తరగతులను నిర్వహించి, విద్యార్థులకు పోటీలను కూడా నిర్వహించాలని సూచించారు.
News October 6, 2025
పాత అర్బన్ బ్యాంకు ఆవరణలో బొత్సకు ఏర్పాట్లు

శ్రీ పైడితల్లమ్మ సిరిమానోత్సవాన్ని తిలకించేందుకు శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక డీసీసీబీ బ్యాంక్ ఆవరణ నుంచి తిలకించేందుకు DCCB ఛైర్మన్ నాగార్జున విముఖత తెలపడంతో పాత అర్బన్ బ్యాంకు ఆవరణలో వేదిక ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రోటోకాల్ ప్రకారం బొత్సకు వేదిక ఏర్పాటును ముమ్మరం చేశారు.