News November 19, 2025
భూపాలపల్లి జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటు: ఎంపీ

భూపాలపల్లి జిల్లా అభివృద్ధి కోసం ఉన్న వనరులను అధికారులు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీ కడియం కావ్య అన్నారు. జిల్లాకు రైల్వే లైన్ ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపామని, బొగ్గు రవాణా వల్ల రహదారులు పాడవుతున్నాయని కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పెట్టినట్లు ఎంపీ తెలిపారు. భూపాలపల్లి జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు.
Similar News
News March 22, 2026
23 నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశాలు: కలెక్టర్

మార్చి 23వ తేదీ నుంచి కేంద్రీయ విద్యాలయాల్లో ప్రవేశ ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. చిత్తూరులోని ఇరువారం దగ్గర తాత్కాలిక విద్యాలయం, కుప్పంలోని ద్రవిడ విశ్వవిద్యాలయంలో ప్రవేశ ప్రక్రియలు ప్రారంభం కానున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. సందేహాలకు 8919820152 / 9476007488 నంబర్లను సంప్రదించాలని కోరారు.
News March 22, 2026
రేపటి ప్రజావాణికి సకాలంలో హాజరు కావాలి: కలెక్టర్

మార్చి 23వ తేదీ సోమవారం భద్రాద్రి కలెక్టరేట్‌లో నిర్వహించనున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు సకాలంలో హాజరుకావాలని కలెక్టర్ అంకిత్ తెలిపారు. ప్రజలు తమ తమ సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వక ఫిర్యాదులను సమర్పించాలని సూచించారు. ఉదయం 10:30 గంటలకు ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని పేర్కొన్నారు.
News March 22, 2026
తాగునీటి ఎద్దడి రానీయొద్దు: పద్మశ్రీ ఆదేశం

ఏలూరు జిల్లాలో వేసవి దృష్ట్యా తాగునీటి కొరత తలెత్తకుండా పక్కా ప్రణాళికతో ముందడుగు వేయాలని ఉమ్మడి జడ్పీ చైర్‌పర్సన్ పద్మశ్రీ అధికారులను ఆదేశించారు. ఆదివారం ఏలూరు జడ్పీ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆమె మాట్లాడారు. జిల్లాలోని 557 సమ్మర్ స్టోరేజ్ ట్యాంకులలో ఇప్పటికే అధికశాతం నీటితో నింపినట్లు తెలిపారు. మిగిలిన మంచినీటి చెరువులను కూడా తక్షణమే పూర్తిస్థాయిలో నింపాలన్నారు.


