News November 17, 2025
ఒక్క రన్ కూడా ఇవ్వకుండా 5 వికెట్లు తీశాడు!

రంజీ ట్రోఫీలో భాగంగా హరియాణాతో జరుగుతున్న మ్యాచులో సర్వీసెస్ బౌలర్ అమిత్ శుక్లా 8 వికెట్లతో రాణించారు. ఒక్క రన్ కూడా ఇవ్వకుండా తొలి 5 వికెట్లను పడగొట్టిన శుక్లా, మొత్తంగా 20 ఓవర్లలో 27 పరుగులిచ్చి 8 వికెట్లు తీశారు. అతడి దెబ్బకు హరియాణా జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 111 రన్స్‌కే ఆలౌటైంది. ఈ లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇప్పటివరకు 7 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 32 వికెట్లు పడగొట్టారు.
Similar News
News November 17, 2025
ఐబొమ్మ క్లోజ్.. MovieRulz ఎప్పుడు?

సినిమాలను పైరసీ చేసి సినీ ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలిగిస్తున్న సైట్లను క్లోజ్ చేసే చర్యలు ముమ్మరం అయ్యాయి. ఇప్పటికే విదేశాల నుంచి ఆపరేట్ చేస్తున్న ఐబొమ్మ సైట్ నిలిచిపోయింది. అలాగే రిలీజైన రోజే పైరసీ చేసే MovieRulz, Tamil Rockers వంటి ఇతరత్రా సైట్స్ పని పట్టి ఇండస్ట్రీకి న్యాయం చేయాలని పలువురు నెట్టింట పోస్టులు పెడుతున్నారు. పైరసీ నెట్‌వర్క్‌పై కఠినమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 31 కృష్ణ జింకలు మృతి

కర్ణాటకలోని కిత్తూరు రాణి చెన్నమ్మ జూలో బాక్టీరియల్ ఇన్ఫెక్షన్‌తో 4 రోజుల్లో 31 కృష్ణ జింకలు మృతి చెందాయి. దీనిపై దర్యాప్తుకు ఆదేశించినట్లు అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే తెలిపారు. ఇన్ఫెక్షన్ సోకడంతో జూ అధికారులు, వెటర్నరీ వైద్యులు ట్రీట్మెంటు అందించారని చెప్పారు. ఇతర జూలకు అది వ్యాపించకుండా చర్యలు చేపట్టినట్లు వివరించారు. బాక్టీరియా వ్యాప్తికి కారణం తెలుసుకొనేందుకు నిపుణుల బృందాన్ని పంపామన్నారు.