News April 13, 2024

నెల్లూరు: 15వ తేదీతో ముగియనున్న గడువు

image

15వ తేదీ రాత్రితో ఓట్ల నమోదుకు గడువు ముగియనుంది. 18 ఏళ్లు నిండి ఇంకా ఓటు నమోదు చేసుకోని వారు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యంత్రాంగం సూచిస్తోంది. ఇటీవల విడుదలైన జాబితాలో జిల్లాలో 18 నుంచి 19 వయసు ఓటర్లు 36,175 మంది ఉండగా… 40-49 ఏళ్ల వారు అత్యధికంగా 4,29,668 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Similar News

News October 6, 2025

త్వరలో నెల్లూరుకు రానున్న పవన్..?

image

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇటీవల పవన్ పర్యటనపై పలు వార్తలు వినిపించాయి. అయితే అక్టోబర్‌లో పవన్ పర్యటన దాదాపు ఖరారు అవుతుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటనకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద అక్టోబర్‌లోనే పవన్ నెల్లూరు రానున్నారని తెలుస్తోంది.

News October 6, 2025

ఆ మందు నెల్లూరు జిల్లాలో లేదు: రమేశ్

image

మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగి 11 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై నెల్లూరు ఔషద నియంత్రణ శాఖ ఏడీ రమేశ్ రెడ్డిని Way2News ఫోన్లో సంప్రదించగా.. కోల్డ్రిఫ్ దగ్గు మందు నెల్లూరు జిల్లాలో లేదన్నారు. ఆ మందులో డై ఇథైలీన్ గ్లైకాల్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.

News October 6, 2025

నెల్లూరు: ఇలా చేస్తే ఆటో డ్రైవర్స్ అందరికీ డబ్బులు

image

ఆటో డ్రైవర్ల సేవలో పథకం నిధులు చాలా మంది ఆటో డ్రైవర్స్‌కి రాలేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హత ఉండి కూడా నిధులు జమకాని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. దగ్గర్లోని సచివాలయంలో ఆటో డ్రైవర్లు ఫిర్యాదు చేస్తే.. వారు ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. ఆ ఫిర్యాదు నేరుగా రవాణా శాఖకి వెళ్తుంది. వారి అన్నీ పరిశీలించి అర్హత ఉంటే రూ.15 వేలు ఆటో డ్రైవర్స్ అకౌంట్‌లో జమ చేస్తారు.