News November 19, 2025
తూప్రాన్: 145 గ్రాముల ఎండు గంజాయి పట్టివేత

తూప్రాన్ పట్టణంలో 145 గ్రాముల ఎండు గంజాయిని పట్టుకున్నట్టు ఎస్సై శివానందం తెలిపారు. శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెంకు చెందిన దుగ్గూరి శ్రవణ్ కుమార్ కొద్దిరోజులుగా తూప్రాన్ పట్టణంలో నివాసం ఉంటున్నాడు. ఇతడు గంజాయి అమ్ముతున్నట్లు సమాచారం రాగా దాడులు జరిపి అతని వద్ద నుంచి145 గ్రాముల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్‌ను SI స్వాధీనం చేసుకున్నారు. నాందేడ్‌కు చెందిన శివ గంజాయి సరఫరా చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
Similar News
News April 2, 2026
మెదక్: ‘మీ సేవ’ ఛార్జీల పెంపు: అదనపు కలెక్టర్

‘మీ సేవ’ కేంద్రాల ఛార్జీలు పెంచినట్లు మెదక్ అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. కనీస ఛార్జీ రూ.35 నుంచి రూ.62కి పెరిగిందని, A కేటగిరీకి రూ.62, B కేటగిరీ సేవలకు రూ.80గా నిర్ణయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంపై మీసేవ నిర్వాహకులు హర్షం వ్యక్తం చేశారు. నిర్ణయించిన ధరలకు మించి వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 3వ తేదీన మెయింటెనెన్స్ డే కారణంగా కేంద్రాలు పనిచేయవన్నారు.
News April 2, 2026
మనోహరాబాద్: సబ్బుపై హనుమాన్ రూపం

హనుమాన్ జయంతి సందర్భంగా చిత్రకారుడు సబ్బుపై హనుమాన్ చిత్రం చెక్కారు. మనోహరాబాద్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల చిత్ర లేఖనం ఉపాధ్యాయుడు బ్రహ్మచారి సబ్బుపై వీర హనుమాన్ రూపాన్ని చెక్కి తన భక్తిని చాటుకున్నారు. చిత్ర లేఖనంతో విద్యార్థుల భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిగా నిలుస్తున్న ఉపాధ్యాయుడిని పలువురు అభినందించారు.
News April 2, 2026
మెదక్: గడ్డిమందు కొనుగోలు, వినియోగం చేయరాదు: వ్యవసాయ అధికారి

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు గడ్డి మందు విక్రయాలు, నిల్వలు, వినియోగంపై 60 రోజుల నిషేధం విధించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి దేవకుమార్ తెలిపారు. ఈ నిషేధం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చినట్లు చెప్పారు. రైతులు గడ్డి మందు కొనుగోలు, వినియోగం చేయరాదని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించి అమ్మకాలు జరిపే ఫర్టిలైజర్ దుకాణదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


