News November 19, 2025
పార్వతీపురంలో ఈనెల 28న ఉద్యోగుల, విశ్రాంత ఉద్యోగుల గ్రీవెన్స్

ఈనెల 28వ తేదీ శుక్రవారం ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. ఈనెల 28న కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఉదయం 11.00 గంటలకు గ్రీవెన్స్ ప్రారంభమవుతుందన్నారు. సమస్యలను ఈ గ్రీవెన్స్‌లో దరఖాస్తుల రూపంలో అందజేయవచ్చని పేర్కొన్నారు.
Similar News
News March 27, 2026
HYD: పెట్రోల్ ఫుల్.. ఇక నో టెన్షన్!

రాష్ట్రంలో ఇంధన సరఫరా జోరందుకుంది. సాధారణంగా రోజూ వచ్చే 13,231 కిలో లీటర్ల కంటే రెట్టింపు స్థాయిలో మార్చి 26న ఏకంగా 36,189 కిలో లీటర్ల పెట్రోల్, డీజిల్‌ను సర్కార్ పంపిణీ చేసింది. ఇందులో 16,609 KL పెట్రోల్, 19,580 KL డీజిల్ ఉన్నాయి. సగటు అవసరాల కంటే భారీగా స్టాక్ అందుబాటులోకి రావడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రద్దీ తగ్గించుకొని, ధైర్యంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

బాపట్ల జిల్లా ఎస్పీ హెచ్చరిక

యువత క్రికెట్ బెట్టింగులకు దూరంగా ఉండాలని ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. ఈనెల 28 నుంచి దేశవ్యాప్తంగా ఐపీఎల్ సీజన్ మొదలవుతున్న నేపథ్యంలో క్రికెట్ బెట్టింగులపై ఎస్పీ శుక్రవారం హెచ్చరికలు చేశారు. క్రికెట్ బెట్టింగ్ పెనుభూతం లాంటిదని దానికి ఎవరు బలికావద్దన్నారు. బెట్టింగులకు పాల్పడినా, ఇతరులను ప్రోత్సహించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.