News November 19, 2025

మహబూబ్‌నగర్: ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్‌లు

image

మహబూబ్‌నగర్ జిల్లా ఎస్సీ విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరానికి ప్రీ-మెట్రిక్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది. 5 నుంచి 10వ తరగతి చదువుతున్న వారికి సంవత్సరానికి రూ.1,000 నుంచి రూ.3,500 వరకు అందజేస్తారు. అర్హులైన విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువపత్రాలు, ఆధార్‌ కార్డుతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా షెడ్యూల్డ్ కులాల శాఖ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News March 25, 2026

KNR: ఆయిల్ పామ్ లక్ష్యం ‘లక్షల్లో’.. సాగు ‘వేలల్లో’

image

ఉమ్మడి KNR(D)లో ఆయిల్ పామ్ సాగును పరుగులు పెట్టించాలని ప్రభుత్వం భావించినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా ఉంది. 2022-26 నాలుగేళ్ల కాలానికి 1.30 లక్షల ఎకరాల సాగు లక్ష్యంగా పెట్టుకోగా, ఇప్పటివరకు సాధించింది కేవలం 11,900 ఎకరాలు మాత్రమే. PDPL 45,000 ఎకరాల లక్ష్యానికి గానూ 3,000 ఎకరాల్లోనే సాగు. KNR 45,000 గాను 2,200 ఎకరాల్లోనే సాగు. JGTL 8,500- 4,500. SRCL 8,500- 2,200 ఎకరాల్లో సాగు చేస్తున్నారు.

News March 25, 2026

చిన్న నియోజకవర్గం.. గొప్ప అభివృద్ధి

image

దేశంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగితే లోక్‌సభ స్థానాలు పెరుగుతాయి. దీనివల్ల ఒక్కో MP పరిధిలోని జనాభా 30 లక్షల నుంచి 15 లక్షలకు తగ్గుతుంది. చిన్న నియోజకవర్గాల వల్ల MPలు ప్రజలకు మరింత అందుబాటులోకి వస్తారు. ఫలితంగా స్థానిక సమస్యల పరిష్కారం వేగవంతం కావడంతో పాటు MP నిధుల వినియోగంలో పారదర్శకత పెరుగుతుంది. ఈ మార్పు క్షేత్రస్థాయి అభివృద్ధికి, యువ నాయకత్వం రాజకీయాల్లోకి రావడానికి అవకాశంగా నిలుస్తుంది.

News March 25, 2026

నర్సాపూర్: స్వయంభూగా కొలువైన సీతారామసమేత ఆలయం

image

స్వయంభు ఏకాంతంగా వెలిసిన సీతారామ స్వామి ఆలయంగా పేరు పొందుతున్న నర్సాపూర్ పట్టణ సమీపంలోని సీతారాంపూర్లో ప్రతిఏటా శ్రీరామనవమి ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు పూజారి హరిప్రసాద్ శర్మ తెలిపారు. 600 ఏళ్ల క్రితం కాకతీయులు ఆలయం నిర్మించినట్లు తెలిపారు. శ్రీ సీతారామసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3 రోజులపాటు ఉత్సవాల గురించి ఆయన వే2న్యూస్‌తో తెలిపారు. ఉదయగిరి చుట్టూ బండ్ల ప్రదక్షిణలు నిర్వహిస్తారన్నారు.