News November 19, 2025
పెద్దారవీడు వద్ద ఎద్దుల అరకలను ఢీకొని దోర్నాల వ్యక్తి మృతి

పెద్దారవీడు మండలం బద్వీడు చెర్లోపల్లి సమీపంలో మంగళవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై వెళ్తున్న ఎద్దుల అరకలను ద్విచక్రవాహనం ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనంపై ఉన్న ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. వారిని మార్కాపురం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడు దోర్నాల మండలం యడవల్లికి చెందిన నల్లబోతుల శివగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Similar News
News March 20, 2026
ప్రకాశం జిల్లాలో పెట్రోల్ ధరల పెంపు

ఉమ్మడి ప్రకాశం జిల్లాపై యుద్ధ ప్రభావం కనిపిస్తోంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు పవర్ పెట్రోల్ ధరల పెంపుతో మరో షాక్ తగిలింది. గిద్దలూరులోని అన్ని బంకుల్లో పెట్రోల్ లీటర్‌పై రూ.2.35 పెంచి రూ.119.59 చొప్పున విక్రయిస్తున్నారు. సాధారణ పెట్రోల్ ధరల్లో ఎలాంటి మార్పులు లేకపోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.
News March 20, 2026
అందాల పోటీలు.. మార్కాపురం యువతికి కిరీటం

మార్కాపురానికి చెందిన శ్రీరంగం నరసింహచార్యులు కుమార్తె దీప్తి ప్రతిభ చూపింది. హైదరాబాద్‌లో మిస్ ఇన్ఫినిటీ ఆఫ్ ఇండియా-2026 కిరీటాన్ని దక్కించుకుంది. ఈ ఫ్యాషన్ షోలో 500 మంది పైగా పాల్గొన్నారు. దీప్తి విజేతగా నిలిచింది. మ్యూజిక్ డైరెక్టర్ కోటి చేతుల మీదుగా రూ.3లక్షల ప్రైజ్ మనీ,కిరీటాన్ని అందుకున్నారు.
News March 20, 2026
పోలీసులు అప్రమత్తంగా ఉండాలి: ప్రకాశం SP

రంజాన్ సందర్భంగా ప్రకాశం జిల్లా ముస్లిం సోదరులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర మాసంలో ఉపవాసాలు, ప్రార్థనలు, దానధర్మాలు ఎంతో గొప్పవని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖసంతోషాలు నెలకొనాలని ఆకాంక్షించారు. పండగ సందర్భంగా మసీదులకు భారీగా వచ్చే భక్తులను దృష్టిలో ఉంచుకుని పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ చేపట్టాలని ఆదేశించారు.


