News April 13, 2024
తల్లీ, కుమార్తె మృతదేహాలు లభ్యం

ఆర్థిక ఇబ్బందులతో భీమవరానికి చెందిన కిషోర్‌కుమార్(32), అతని భార్య యోచన(24) కుమార్తె నిధిశ్రీ(2)తో చించినాడ వశిష్ఠ వంతెనపై నుంచి గోదావరిలో దూకిన విషయం తెలిసిందే. గురువారం కిషోర్ మృతదేహం.. శుక్రవారం తల్లీ, కుమార్తె మృతదేహాలు దొరికాయి. పాలకొల్లులో పోస్టుమార్టం చేశారు. మరణంలోనూ పేగు బంధాన్ని వీడలేక యోచన చున్నీతో కుమార్తెను కట్టేసుకొని దూకినట్లు తెలుస్తోంది. వీరు కొద్దిరోజులుగా అమలాపురంలో ఉన్నారు.
Similar News
News April 4, 2026
పులిని బంధించేందుకు నెలకోట చేరిన మహారాష్ట్ర బృందం

పోలవరం(D) నేలకోట కొండ వద్ద మకాం వేసిన పులిని బంధించేందుకు మహారాష్ట్ర నుంచి 12 మంది సభ్యుల బృందాన్ని శుక్రవారం ఏలూరు, రంపచోడవరం, రాజమహేంద్రవరం అటవీశాఖ అధికారులతో కలిసి నేలకోట, గండికోట మధ్యలో బృందం మాటువేసింది. పెదకొండేపూడిలో గోశాల వద్ద మరో బృందాన్ని ఉంచారు. ఈ రాత్రికి పులిని బంధించడం లేదా రిజర్వు ఫారెస్టు వైపు పులిని దారి మళ్లించేలా ఏర్పాటు చేసినట్లు అటవీశాఖ అధికారి తెలిపారు.
News April 4, 2026
తూ.గో: రైతులకు మంత్రి మనోహర్ భరోసా..!

కాపవరం గ్రామంలోని హైవే పక్కన ఉన్న ధాన్యాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ పరిశీలించారు. శుక్రవారం కాపవరం హైవేలో వెళ్తున్న ఆయన రైతులను చూసి ఆగారు. ధాన్యాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడి సమస్యలను పరిశీలిస్తామని తెలిపారు. రైతులకు ప్రభుత్వం నుంచి మంచి ధరలు వచ్చేలా చూస్తామన్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని అన్నారు. జనసేన మండలాధ్యక్షుడు సుంకర సత్తిబాబు, ఇతర కూటమి నేతలు పాల్గొన్నారు.