News November 19, 2025
చిత్తూరు రైతులకు నేడు రూ.136.46 కోట్ల జమ

చిత్తూరు జిల్లాలోని రైతులకు బుధవారం అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకానున్నట్లు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ వెల్లడించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద 2.05 లక్షల మంది రైతులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.102.88 కోట్లు విడుదల చేయనుంది. పీఎం కిసాన్ పథకం కింద 1.67లక్షల మంది రైతులకు రూ.33.58 కోట్లను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది. మొత్తంగా జిల్లా రైతుల ఖాతాల్లో బుధవారం రూ.136.46 కోట్ల జమవుతుంది.
Similar News
News March 25, 2026
చిత్తూరు: భర్త కళ్లెదుటే బావిలో దూకిన భార్య

పెనుమూరు మండలంలోని అతిమాకులపల్లి గ్రామానికి చెందిన సుకన్య భర్తతో గొడవపడి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. భర్త బాబు ఎదుటే బావిలోకి దూకినట్లు తెలుస్తోంది. అతనికి ఈత రాకపోవడంతో గ్రామంలోకి వెళ్లి గ్రామస్థులను తీసుకొచ్చే సరికి భార్య నీటిలో మునిగిపోయింది. దీంతో గ్రామస్థులు ఆమె మృతదేహం కోసం గాలింపు చేపట్టారు. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారని గ్రామస్థులు చెబుతున్నారు.
News March 25, 2026
చిత్తూరు: అందుకోసమే కలపలేదా.?

జిల్లాల పునర్విభజన సమయంలో పుంగనూరు నియోజకవర్గంలోని పులిచెర్ల, రొంపిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపలేదు. అలాగే నగరి నియోజకవర్గంలోని మూడు మండలాలనూ తిరుపతిలో కలపాలని పెద్ద ఎత్తున ప్రజల నుంచి డిమాండ్ ఉన్నా అలా జరగలేదు. అసెంబ్లీ స్థానాల పునర్విభజన సమయంలో ప్రక్రియ సులువుగా సాగేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలువురు భావిస్తున్నారు.
News March 25, 2026
ఉద్యోగ క్రీడాకారులను అభినందించిన కలెక్టర్

జాతీయస్థాయి సివిల్ సర్వీసెస్ ఖోఖో పోటీలలో ప్రతిభ చూపిన జిల్లా ఉద్యోగుల క్రీడాకారులను కలెక్టర్ సుమిత్ కుమార్ అభినందించారు. మంగళవారం రాత్రి తన ఛాంబర్‌లో వారికి పతకాలను అందజేశారు. ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు పూణేలో జరిగిన జాతీయ స్థాయి సివిల్ సర్వీస్ ఖోఖో పోటీలలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జట్టు విశేష ప్రతిభ కనబరచి కాంస్య పతకాన్ని సాధించింది.


