News November 19, 2025

కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

image

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News March 24, 2026

పిట్లం: తగ్గిన పసిడి ధర: పుంజుకున్న పసిడి విక్రయాలు!

image

గత కొంతకాలంగా ఆకాశాన్నంటుతున్న బంగారం ధరలు సామాన్యులకు చుక్కలు చూపించాయి. అయితే, గత రెండు రోజులుగా పసిడి ధరలు భారీగానే తగ్గడంతో మార్కెట్‌లో మళ్లీ గిరాకీ పుంజుకుంది. ప్రస్తుతం అంతర్జాతీయ పరిణామాలు, మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ధరలు కాస్త దిగిరావడంతో, వినియోగదారుల్లో హుషారు కనిపిస్తోంది. రాబోయే వివాహ ముహూర్తాల కోసం నగలు చేయించుకునేందుకు ప్రజలు మళ్లీ కొనేందుకు ఆసక్తి చూపుతున్నారు.

News March 24, 2026

యుద్ధం.. అమెరికాతో జైశంకర్ చర్చలు

image

అమెరికా సెక్రటరీ ఆఫ్ స్టేట్ రూబియోతో విదేశాంగ మంత్రి జైశంకర్ ఫోన్‌లో మాట్లాడారు. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై వాటి ప్రభావంపై చర్చించారు. ముఖ్యంగా హార్ముజ్ వివాదం నేపథ్యంలో ఇంధన భద్రత గురించి ఆందోళన వ్యక్తం చేశారు. యుద్ధాన్ని ఐదు రోజులు వాయిదా వేసినట్లు ట్రంప్ ప్రకటించిన కాసేపటికే ఈ చర్చలు జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. 2 దేశాలు నిరంతరం టచ్‌లో ఉండాలని నిర్ణయించాయి.

News March 24, 2026

క్షయ వ్యాధి రహిత ఆదిలాబాదే లక్ష్యం..!

image

ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో క్షయ (టీబీ) వ్యాధి నిర్మూలనకు వైద్యారోగ్య శాఖ ముమ్మర చర్యలు చేపట్టింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో సుమారు 5,800 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు. ‘నిక్షయ్‌ మిత్ర’ పథకం ద్వారా దాతలు బాధితులను దత్తత తీసుకుని పౌష్టికాహారం అందిస్తున్నారు. ప్రభుత్వం ప్రతి నెలా ₹500 రోగుల ఖాతాల్లో జమ చేస్తోంది. క్షయ రహిత జిల్లాగా మార్చడమే లక్ష్యం.
# నేడు క్షయ వ్యాధి నివారణ దినోత్సవం