News November 19, 2025

కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

image

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News March 11, 2026

అల్లూరి: పరీక్షలకు 67 మంది గైర్హాజర్

image

ఉమ్మడి అల్లూరి జిల్లాలో బుధవారం జరిగిన ఓపెన్ ఇంటర్ పరీక్షలకు 67మంది గైర్హాజర్ అయ్యారని జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శశికుమార్ తెలిపారు. ఆరు పరీక్ష కేంద్రాల్లో మెథ్స్, హిస్టరీ, అకౌంటెన్సీలలో పరీక్ష జరిగిందన్నారు. అల్లూరి జిల్లాలో 387 మందికి గాను 350 మంది విద్యార్థులు పరీక్షలు రాసారన్నారు. పోలవరం జిల్లాలో 338 మందికి గాను 308 మంది హాజరయ్యారని వెల్లడించారు. ప్రశాంతంగా పరీక్షలు జరిగాయాని చెప్పారు.

News March 11, 2026

మార్చి 15 నుంచి భారీ వర్షాలు: వాతావరణ నిపుణులు

image

TG: మార్చి 15 నుంచి రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేశారు. తొలుత ఉత్తర, మధ్య తెలంగాణలో వానలు పడతాయని పేర్కొన్నారు. మార్చి 16 లేదా 17 నుంచి రాష్ట్రమంతటా వడగళ్ల వర్షాలతో పాటు భారీ ఈదురుగాలులు వీస్తాయని తెలిపారు. రైతులు ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. మరోవైపు నేటి నుంచి 3 రోజుల పాటు ఉష్ణోగ్రతలు గరిష్ఠంగా ఉంటాయని హెచ్చరించారు.

News March 11, 2026

మహేశ్ ఫ్యాన్స్‌కు క్షమాపణలు చెప్పిన డైరెక్టర్ హరీశ్

image

‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ సందర్భంగా ఓ పవన్ అభిమాని ‘BoB రికార్డులు లేచిపోవాలి’ అని చేసిన ట్వీట్‌కు డైరెక్టర్ హరీశ్ ‘తథాస్తు’ అని రిప్లై ఇవ్వడం వివాదాస్పదమైంది. మహేశ్‌ను BoB (బాస్ ఆఫ్ బ్లాక్‌బస్టర్స్)గా పిలుచుకునే ఫ్యాన్స్ హరీశ్‌పై ఫైరవుతున్నారు. కాగా పని ఒత్తిడిలో తెలియక జరిగిన పొరపాటని హరీశ్ సారీ చెప్పారు. తనకు మహేశ్ అంటే ఎంతో గౌరవమని, రాజమౌళి మూవీతో రికార్డులన్నీ తిరగరాస్తారని ట్వీట్ చేశారు.