News April 13, 2024

HYD: పెరగనున్న సిటీ బస్సులు!

image

గ్రేటర్‌ HYDలో బస్సుల సంఖ్య పెరుగుతోంది. 2,850 బస్సులతో ప్రధాన రూట్లకే పరిమితమైన RTC ఇప్పుడు పూర్వవైభవాన్ని చాటేందుకు సిద్ధమౌతోంది. గతంలో 3,850 బస్సులు HYD జోన్‌లో ఉండేవి. 2019లో అప్పటి ప్రభుత్వం ఒకేసారి 1000 బస్సులను తగ్గించింది. ఇదిలా ఉండగా ప్రస్తుతం మహిళా ప్రయాణికుల సంఖ్య పెరిగింది.దీంతో జిల్లాల్లో తిరుగుతున్న డీలక్స్‌ బస్సులను నగరానికి తెచ్చి సిటీ బస్సులుగా మార్చే పనులు చురుగ్గా సాగుతున్నాయి.

Similar News

News March 13, 2026

HYD: రూ.5 భోజనం వెనక పక్కా ప్రణాళిక

image

HYDలో రూ.5 భోజనం వెనక పక్కా ప్రణాళిక ఉంది. ప్రతి ప్లేటు ఖరీదు దాదాపు రూ 24.25 అవుతుండగా, సామాన్యుడు చెల్లించేది రూ.5 మాత్రమే. మిగిలిన రూ.19.25 సబ్సిడీని GHMC భరిస్తోంది. ప్రభుత్వం బడ్జెట్‌లో ఏటా రూ.కోట్లు కేటాయిస్తోంది. హరే రామ హరే కృష్ణ ట్రస్ట్ కేవలం వంట వండటమే కాకుండా నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణ బాధ్యతను తీసుకుంది. ఈ సమన్వయం వల్లే నగరంలో రోజూ <<19364297>>45 వేల<<>> మందికి పైగా ఆకలి తీరుతోంది.

News March 13, 2026

HYD అభివృద్ధి@2050.. కీలక ప్రతిపాదనలు

image

HYD మెట్రోపాలిటన్ ప్రాంతం కోసం సమగ్ర మొబిలిటీ ప్రణాళిక వర్క్‌షాప్‌‌లో ఉన్నతాధికారులు కీలక ప్రతిపాదనలు చేశారు. 2050 వరకు మౌలిక సదుపాయాల ప్రణాళిక కోసం బ్లూ, గ్రీన్ మాస్టర్ ప్లాన్‌కు ప్రతిపాదించారు. మెట్రో నెట్‌వర్క్ పెంపు, రోడ్లు, హైవేలు, ఆర్టీరియల్, సబ్ ఆర్టీరియల్ కారిడార్లు, 120 ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు/స్కైవాక్‌లు, 34 ROBలు, 16 RUBలు, 8 ఎలివేటెడ్ రోడ్లు, మూసీ నదిపై 29 వంతెనల కోసం ప్రతిపాదించారు.

News March 12, 2026

Trending: HYDలో నైట్ లైఫ్‌కు కొత్త VIBE

image

సిటీలో నైట్ సీన్ మామూలుగా లేదు బాసూ. కేవలం బిర్యానీతోనే సరిపెట్టకుండా మన GEN-Z కొరియన్ ఫుడ్, చీజ్ బర్స్ట్ స్నాక్స్ కోసం క్యూ కడుతున్నారు. రీల్స్ కోసం ‘ఫైర్’ ఐటమ్స్, క్యాన్ డెజర్ట్స్ ఇప్పుడు ట్రెండింగ్. వీకెండ్ వచ్చిందంటే చాలు.. లేట్ నైట్ డ్రైవ్స్, అదిరిపోయే డీజే మ్యూజిక్, లైవ్ గిగ్స్‌తో హైదరాబాద్ హోరెత్తిపోతోంది. అటు తిండి.. ఇటు మ్యూజిక్ కలిసి హైదరాబాద్ నైట్ లైఫ్ ఇప్పుడు నెక్స్ట్ లెవల్‌లో ఉంటోంది.