News November 19, 2025

కర్నూలు: రూ.3 లక్షల వేతనంతో ఉద్యోగాలు

image

ఈనెల 20న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కర్నూలు జిల్లా ఉపాధి కల్పన అధికారి పి.దీప్తి తెలిపారు. రిలయన్స్ కన్స్యూమర్ ప్రాడక్ట్స్ లిమిటెడ్ కోసం మ్యానుఫ్యాక్చరింగ్ ఆపరేటర్ పోస్టులు భర్తీ చేయనున్నారని పేర్కొన్నారు. డిప్లొమా/ఐటీఐ అర్హతతో 24 ఏళ్ల వయస్సు గల అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఉద్యోగానికి ఎంపికైతే వార్షిక వేతనం రూ.3 లక్షలు ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు www.ncs.gov.inలో నమోదు చేసుకోవాలన్నారు.

Similar News

News March 30, 2026

అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

image

ఖమ్మం జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’లో కలెక్టర్ అనుదీప్ ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. భూ ఆక్రమణలు, పిచ్చి కుక్కల బెడద, సీసీ రోడ్లు, డ్రైనేజీ, పెన్షన్ వంటి వివిధ సమస్యలపై వచ్చిన అర్జీలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు.

News March 30, 2026

బంగ్లాదేశ్‌లో IPL టెలికాస్ట్ లేనట్లే

image

బంగ్లాదేశ్‌లో ఐపీఎల్ మ్యాచుల ప్రసారం జరిగే అవకాశం లేదు. ఇటీవల ఆ దేశ ప్రభుత్వం మ్యాచుల ప్రసారానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ బ్రాడ్‌కాస్ట్ అగ్రిమెంట్‌ను జియో స్టార్ తాజాగా రద్దు చేసుకుంది. 2023-2027 వరకు ప్రసార హక్కులను తీసుకున్న బంగ్లా ఛానల్ ‘టీ స్పోర్ట్స్’ గడువులోగా పేమెంట్స్ చేయలేదు. దీంతో జియో స్టార్ ఒప్పందాన్ని రద్దు చేసింది. WPLకూ ఇది వర్తించనుంది.

News March 30, 2026

కామారెడ్డి: ప్రజావాణిలో 117 దరఖాస్తులు

image

కామారెడ్డి కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ప్రజల నుంచి 117 దరఖాస్తులను స్వీకరించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రజల సమస్యలను పెండింగ్‌లో పెట్టకుండా తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పరిష్కారం కాని దరఖాస్తులపై బాధితులకు స్పష్టమైన వివరణ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు విక్టర్, మధుమోహన్ పాల్గొన్నారు.